చిరుధాన్యాల్లో జొన్నలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.నిత్యం మన జీవక్రియలకు అవసరమైన
శరీరఅభివృద్ధికి ఉపయోగపడే మాంసకృత్తులు, పిండిపదార్ధాలు, ఫైబర్, ఇనుము, కాల్షియం, బి-విటమిన్లు, ఫోలిక్ ఆమ్లం వంటి పోషకాలున్న జొన్న ధాన్యంలో సమృద్ధిగా ఉన్నాయి. జొన్నలతో అనేక రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్న రొట్టెలు,జొన్న ఉప్మా ,అంబలి,జొన్న సంగటి, జొన్న వడియాలు వంటివి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ప్రస్తుతం జొన్న రొట్టెలు అత్యంత ఖరీదైన వంటకం.
ఆరోగ్యకరమైన రుచికరమైన జొన్న రొట్టెలను, జొన్నలతో తయారు చేసే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం.
*జొన్నల్లో విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. కావున ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడి ప్రమాదకర రక్తహీనత వంటి సమస్యలను నివారిస్తుంది.
*జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడి మధుమేహ వ్యాధినీ అదుపులో ఉంచుతుంది.
*జొన్నల్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, కాపర్, ఐరన్, పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల బీపీ, గుండె జబ్బులు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులను తరిమేయవచ్చు.
*జొన్నల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫోలిక్ యాసిడ్ అన్నిరకాల క్యాన్సర్లను నివారించడంలో కీలక పాత్ర వహిస్తుంది. కనుక నిత్యం చర్యలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.
Share your comments