నలుగురిలో కలిసి మాట్లాడాలన్న, స్వేచ్ఛగా నవ్వాలన్న మన పళ్ళు అందంగా ఉండాలి. అప్పుడే అందరితో కలిసి ఎంతో కలవిడిగా మాట్లాడగలము. అదే కనుక మన పళ్ళ పై పసుపుపచ్చని మరకలు ఉంటే నలుగురితో కలిసి మాట్లాడటానికి సంకోచిస్తాము. అయితే ఈ విధమైన పసుపుపచ్చని దంతాలతో బాధపడేవారు ఈ క్రింది తెలిపిన చిట్కాలను పాటిస్తే మన పళ్ళు ఎంతో తెల్లగా మెరిసిపోతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మనం రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే కొన్ని ఆహార పదార్థాల కారణంగా కూడా మన పళ్ళు పసుపు పచ్చగా మారతాయి.ముఖ్యంగా కాఫీ టీ వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల దంతాలపై పసుపురంగు చారలు ఏర్పడతాయి. ఈ క్రమంలోని ఈ పసుపు చారలు తగ్గిపోవాలంటే చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను తగ్గించాలి.అదేవిధంగా పాలు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవటం వల్ల అందులో ఉన్నటువంటి క్యాల్షియం మన పళ్ళ పై ఏర్పడిన పసుపుపచ్చని మరకలను తొలగిస్తుంది.
చాలామందిలో ధూమపానం చేయడం వల్ల కూడా పళ్లపై పసుపుపచ్చని మరకలు ఏర్పడతాయి. ముందు ధూమపానం మానుకోవడం వల్ల ఈ విధమైన సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే బేకింగ్ సోడా ఉపయోగించి పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళ పై ఏర్పడిన పసుపు పచ్చని మరకలు తొలగిపోతాయి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని బాగా పుక్కిలించడం వల్ల పళ్ళ పై ఏర్పడిన మరకలు తొలిగిపోవడమే కాకుండా నోటిలో ఏర్పడినటువంటి క్రిములు బ్యాక్టీరియాల నుంచి వచ్చే దుర్వాసనను కూడా తగ్గిస్తుంది.
అలాగే ప్రతి రోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఏర్పడిన బ్యాక్టీరియాలు తొలగిపోయి పళ్ళును శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల దంతాలపై ఏర్పడిన మచ్చలు తొలగిపోయి మీ పళ్ళు తళతళ మెరుస్తాయి.
Share your comments