Health & Lifestyle

నో డైట్ డే: ఎంతకావాలంటే అంత తినండి

KJ Staff
KJ Staff

ఈ రోజు అంతర్జాతీయ నో డైట్ డే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, స్టార్లు, యాక్టర్ల ఫిసికల్ అప్పీరెన్స్ చూసి వారిలాగా ఉండాలి అనే ఆలోచన ఎక్కువఅవుతుంది. స్లిమ్ గా ఉండటం, ఫెయిర్ గా కనబటం, వీటినే బ్యూటీ స్టాండర్డ్ అనుకునే రోజులివి. ఆకర్షణీయంగా కనిపించాలన్న మోజులో పడిన యువత డైటింగుల పేరుతో నానా ప్రయోగాలు చేస్తూ ఉన్న ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు.

ఇటువంటివారందరి కోసం అందమంటే ఈ విధంగాగే కనబడాలన్న ఆలోచనను దూరం చేసి, నచ్చింది తింటూ, ఆరోగ్యకరంగా జీవితాన్ని జీవించాలన్న ఆలోచనను ప్రేరేపించేందుకు ఈ అంతర్జాతీయ నో డైట్ డే జరుపుకుంటారు. 1992 లో మేరీ ఎవాన్స్ అనే ఆవిడ ఈ నో డైట్ డే ప్రారంభించారు. పురుషులైనా, మహిళలైన తమని, తాముగా అంగీకరించుకోవాలన్న నిజాన్ని ఈ రోజు గుర్తుకు చేస్తుంది.

ఫ్యాషన్ మ్యాగజిన్ లలో కనిపించే మోడల్స్ యొక్క ఫోటోషాప్ చిత్రాలను చూసి, ఎంతో మంది వారిలాగా కనబడాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ఈ మధ్య కాలంలో కొరియన్ సిరీస్ మొదలు పెట్టక పిచ్చి పరాకాష్టకు చేరి, కోరియన్స్ లాగా ఫిసికల్ స్ట్రక్చర్, మెరిసే చర్మ సౌందర్యం కోసం డబ్బును, సమయాన్ని వృధా చేస్తున్నారు.

యువతలోని ఈ బలహీనతను అదనుగా చేసుకున్న కొందరు మోసగాళ్లు, ఆన్లైన్ ద్వారా ఫుడ్ డైట్ ప్లన్స్ అన్న పేరుతో వీరి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటువంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసి, ప్రజల్ని సరైన డైటింగ్ విధానాల వైపు మార్చడానికి, మరియు డైటింగ్ చేస్తున్న వారికి ఒక బ్రేక్ కల్పించి వారికి నచ్చింది తినేందుకు స్వేచ్ఛను, ఈ నో డైటింగ్ డే అందిస్తుంది. ప్రతిఒక్కరి శరీర తత్త్వం ఒక్కటి కాదు, శరీర ఆకారంలో వైవిధ్యాన్నిలోని గొప్పతన్నాని ఈ రోజు తెలియచేస్తుంది. అది తింటే లావైపోతాం, లేదా అందంగా కనిపించం అన్న భయాన్ని పక్కన పెట్టి మీకు నచ్చింది తింటూ, మీలోని నిజమైన మనిషిని బయటికి తియ్యండి.

Share your comments

Subscribe Magazine