ఆహారం తీసుకున్న తరువాత ఒకేచోట కూర్చోవద్దు కాసేపు నడవాలి అని చాలామంది చెబుతుంటే వింటుంటాం , నిజానికి తిన్న తరువాత నడవడం అనేది ఎంతవరకు సరైనది ?తిన్న తరువాత నడక శరీరానికి నిజముగా మేలుచేస్తుంద ? పరిశోధనలు ఏంచెబుతున్నాయి అనేది మనం ఎక్కడ తెలుసుకుందాం .
మన చేసే ప్రతి చిన్న పని శరీరానికి మేలు చేస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది. అన్ని సమయాలలో కాకూండా తిన్న తరువాత నడక శరీరానికి ఎంతో మేలుచేస్తుందని , శరీరం చురుకుగా మరి పోషకాలను సరైన క్రమంలో గ్రహింస్తుందని తద్వారా దీనితో కడుపు ఉబ్బరం, గ్యాస్, యాసిడ్ వంటి సాధారణ సమస్యలేవీ రావు. పరిశోధన ప్రకారం, భోజనం తర్వాత 30 నిమిషాలు నడవడం.. వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం అవకాశాలను తగ్గిస్తుంది.
చలి కాలంలో తరుచు వేదించే 5 ఆరోగ్య సమస్యలు..
ఏదైనా శారీరక శ్రమ చేయడం వల్ల మన శరీరంలో ఎండార్ఫిన్ లేదా శరీరానికి మేలుచేసే హార్మోన్ విడుదల అవుతుంది. దాని వల్ల మన శరీరం కాస్త తేలికపాటిదిగా మారుతుంది . నడక ద్వారా శరీరం అలసిపోవడంతో మంచి నిద్ర కల్గుతుంది దీనితో నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి భోజనం తరువాత నడక ప్రారంభించడం ఉత్తమం అని పరిశోధనలు చెబుతున్నాయి . దీని వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా, తిన్న తర్వాత నడవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ షుగర్ మెయింటెయిన్ అవుతుంది. డిప్రెషన్ సమస్య ఉండదు. బరువు కూడా మెయింటైన్ అవుతుంది.
Share your comments