అందంగా కనపడాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఈ క్రమంలోనే వారి అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండవు. ఎన్నో సౌందర్య ఉత్పత్తులను సహజ కాంతిని పెంపొందించే చిట్కాలను పాటించిన కొందరికి మొహంపై మొటిమలు బాధిస్తూనే ఉంటాయి. అయితే ముఖంపై ఏర్పడే మొటిమలను తొలగించుకోవడానికి జోజోబా ఆయిల్ చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.
జోజోబా ఆయిల్ లో ఎక్కువగా విటమిన్ ఇ, బి, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే చర్మం పొడిబారకుండా తేమగా ఉండటానికి దోహదపడుతుంది. ఈ క్రమంలోనే చర్మం తేమగా ఉండి మొహం పై ఎటువంటి మొటిమలు మచ్చలు లేకుండా ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
కొన్ని చుక్కలు జోజోబా ఆయిల్ బంక మట్టిలో కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మెడకు అప్లై చేసుకొని ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొహం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయడం వల్ల అందమైన చర్మకాంతిని పొందవచ్చు.అదేవిధంగా ఈ నూనెను మనం మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం వల్ల మన చర్మం పొడిబారకుండా ఉంటుంది. అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ లో రెండు మూడు చుక్కలు ఈ నూనెను వేసి మసాజ్ చేయడం వల్ల చర్మం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.
Share your comments