ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నటువంటి చెట్లలో కదంబ చెట్టు ఒకటి. ఆగ్నేయాసియాలో పెరిగే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ఈ మొక్కలు దాగి ఉన్న ఔషధ గుణాలు,ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. పలు అధ్యయనాల ప్రకారం ఈ చెట్టు నుంచి మొదలుకొని బెరడు, ఆకులు మన శరీరంలో రక్తం స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా ఈ చెట్టు ఆకులు మెథనాలిక్ సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తాయి.
సాధారణంగా వయసు పైబడిన కొద్దీ శరీరంలో కీళ్ళ వాపులు, నొప్పి ,మంట రావడం సర్వసాధారణమే. అయితే ఈ విధంగా నొప్పి ఉన్న పైభాగంలో కదంబ ఆకులను ఒక బట్టలో కట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో గట్టిగా కట్టడం వల్ల త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ కదంబ ఆకులలో సహజసిద్ధమైన అటువంటి బెరడు అనాల్జేసిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని ద్వారా త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. కదంబ చెట్టులో ఉన్నటువంటి క్లోరోజెనిక్ ఆమ్లం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి దోహదం చేస్తుంది.
అదేవిధంగా మన శరీరంలో క్యాన్సర్ ను కలుగజేసే క్యాన్సర్ కారకాలను అణిచివేయడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ సహా అనేక రకాల క్యాన్సర్ కణాలను అణచివేయడంలో ఈ కదంబ కీలక పాత్ర పోషిస్తుందనీ చెప్పవచ్చు. పూర్వకాలంలో ఈ కదంబ వృక్షం ఆకులను చూర్ణంలాగా తయారు చేసి గాయాలపై రాసుకునేవారు. ఇది గాయాలను మాన్పించటానికి బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా, యాంటి మైక్రోబియల్ ఏజెంటుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఊబకాయ సమస్య నుంచి విముక్తి పొందడానికి కూడా ఈ కదంబ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.
Share your comments