కివి పండు ఆరోగ్యానికి ఒక వరం వంటిది. దీనిలో ఎన్నో రకాల పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కివిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాకుండా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారికి కూడా కివి పండు చక్కగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో కివి ఎంతగానో సహాయపడుతుంది.
కివి పండులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మరియు విటమిన్లు సంవృద్ధిగా లభిస్తాయి. దీనిలో A, B6, B12, E, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము ఉన్నాయి. అంతేకాకుండా కివి పండులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది, కాబ్బటి జీర్ణ సంభందిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. కివి పళ్లలో కెలోరీలు చాలా తక్కువుగా ఉంటాయి, కాబట్టి షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా భయం లేకుండా తినవచ్చు.
మూత్రంలో రాళ్లను తొలగించడంలో కివి చాలా మంచిది. కివీ పండు చర్మ వ్యాధులురాకుండా ఉంచుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నారింజలో ఉన్న విటమిన్ సి కంటే రెండు రెట్లు ఎక్కువగా కివి లో లభిస్తుంది. అరటిపండ్ల కంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కివి తినడం వల్ల చర్మం కాంతివంతంగా, అందంగా ఉండొచ్చు.
కివీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో యాంటీఆక్సిడెంట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొవ్వు ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
కివి పళ్లలో, పొటాషియం సంవృద్ధిగా ఉంటుంది, ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. దీనితోపాటుగా కివి పళ్లలోని కాల్షియమ్ ఎముకుల బలానికి మరియు దంతాల శక్తికి తోడ్పడుతుంది. కివిలో విటమిన్ "సి", కోలిన్, లుటిన్ , జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి. అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌తో పాటు, కివీస్ ఫైబర్ కు కూడా గొప్ప మూలం. ఇది జీర్ణ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, కాలేయాన్ని రక్షించడానికి, రక్తంలో చక్కెరను రక్తపోటును తగ్గించడానికి బరువును నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది.
Share your comments