కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే సీజనల్ వ్యాధుల ముప్పు మరియు దీర్ఘకాలం పాటు వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా మరియు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి మన రోగ నిరోధక వ్యవస్థను పెంచుకోవడమే చక్కటి పరిష్కార మార్గం. సీజన్లో దొరికే తాజా పండ్లతో పాటు అధిక పోషకాల గనిగా పిలువబడుతున్న కివి పండ్లును ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకుంటే సకల వ్యాధి నివారణగా పనిచేస్తుంది.
ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిన
చైనీస్ గూస్బెర్రీ అని పిలువబడే కివి పండ్లలో
అధిక మొత్తంలో విటమిన్ సి, కే, కాల్షియం
పొటాషియం, ఫోలేట్, ఫైబర్, సోడియం, రాగి, యాంటీఆక్సిడెంట్లు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరంలో మలినాలను తొలగించి బరువు తగ్గడానికి,చర్మ సౌందర్యాన్ని మెరుగు పరచడానికి దోహదపడుతుంది .
కివి పండ్లలో రక్తం గడ్డకట్టకుండా నివారించే
యాంటిథ్రోంబోటిక్ సమృద్ధిగా ఉంది దాని వల్ల
బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు భవిష్యత్తులో దూరంగా ఉండవచ్చు. అలాగే
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి
సహాయపడి ప్రమాదకర అనీమియా సమస్యను ఎదుర్కొనవచ్చు. కివి పండ్లలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు రక్తంలోని ఇన్సులిన్‌ను నియంత్రించి టైప్ 1 టైప్ 2 డయాబెటిస్ చెక్ పెట్టొచ్చు. అయితే సాధ్యమైనంతవరకు కివి పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా పండ్ల రూపంలోనే తీసుకుంటే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
Share your comments