మన భారతీయ వంటలలో ఉపయోగించే ఎన్నో సుగంధ ద్రవ్యాలలో లవంగాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. లవంగాలను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు.లవంగాలు ఆహారానికి కేవలం రుచి మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.అయితే చాలామంది వంటలలో లవంగాలు కనిపిస్తే తినకుండా పక్కన పెడుతుంటారు. ఇలా చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పవచ్చు. మరి లవంగాలలో ఉండే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
ప్రతిరోజు లవంగాలను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల దంతాలు చిగుళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. దంత సమస్యలు వచ్చినప్పుడు లవంగాల పొడిని ఆ దంతం కింద పెట్టుకోవడం ద్వారా తొందరగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక చాలామంది ప్రయాణాలు చేస్తున్నప్పుడు వాంతులతో సతమతమవుతుంటారు. అలాంటివారు ప్రయాణానికి ముందు రెండు లవంగాలను నమలడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు.
లవంగాలలో సహజసిద్ధ యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి మన శరీరంలో ఏర్పడే అంటు వ్యాధులతో పోరాడడానికి మన శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఈ క్రమంలోనే దగ్గు జలుబు వంటి వ్యాధులు బారిన పడకుండా ఉండటానికి ఈ రోగ నిరోధక శక్తి ఎంతో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించాలనే అనుకునేవారు అల్లం, లవంగాలు, తులసి పుదీనా ఆకులతో తయారు చేసిన టీ తాగటం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. తరచు తలనొప్పి సమస్యతో బాధపడేవారు రెండు లవంగాలను తింటే తలనొప్పి నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. లవంగాల నూనెలో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. ఇది కీళ్ల నొప్పులు మంటలు నివారించడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. కేవలం వంటలలో మాత్రమే కాకుండా లవంగాలను కాస్మెటిక్ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు కనుక లవంగాలు చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందిస్తాయి.
Share your comments