Health & Lifestyle

రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తున్నారా... ఈ సమస్యలు తప్పవు!

KJ Staff
KJ Staff

ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడి కారణంగా సరైన వేళకు తినడం తాగడం మానేసి పనిలో నిమగ్నం అవుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోతే ఎన్నో అనర్ధాలకు దారితీస్తుందని మనకు తెలిసిందే. పలు పరిశోధనల ప్రకారం మనం రాత్రి తినే భోజనానికి నిద్రకు మధ్య సుమారు మూడు గంటల వ్యవధి ఉండాలని అప్పుడే మనం తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమయ్యి ఏవిధమైనటువంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.అయితే రాత్రి సమయంలో భోజనం లేటుగా చేయడం లేదా తిన్న వెంటనే నిద్రపోవటం వల్ల ఏ విధమైనటువంటి అనర్ధాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని నిపుణులు వెల్లడించారు.చాలా ఆలస్యంగా ఆహారం తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక అందులో ఉన్నటువంటి కేలరీలు మన శరీరంలో పేరుకుపోయి ఊబకాయానికి దారితీస్తుంది.అదేవిధంగా రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి మధుమేహానికి దారితీస్తుంది. అదే విధంగా అధిక రక్తపోటు సమస్యకు కూడా కారణమవుతుంది.

కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపైపలు పరిశోధనలు జరపగా రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం మెదడు పనితీరు పై పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలకు కారణమవుతుంది. రాత్రి సమయంలో భోజనం తీసుకున్న వెంటనే నిద్రపోవటం వల్ల మన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది. రాత్రి సమయంలో జీర్ణక్రియ వ్యవస్థ మందగించడం వల్ల తేలికపాటి ఆహారపదార్థాలను అదికూడా నిద్రపోవడానికి మూడు గంటల ముందుగా ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Share your comments

Subscribe Magazine