Health & Lifestyle

వామ్మో మామిడి పళ్లతో మొటిమలా? ఇది అమ్మాయిలు ఖచ్చితంగా చదవాలి!

KJ Staff
KJ Staff

పండ్లలో రారాజు అంటే అది మామిడి పండే. ఇప్పుడు ఎర్రటి సూర్యుడి తో పాటూ నేను ఉన్నానోచ్ అంటూ కమ్మని మామిడిపళ్ళు కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. దానికి తగ్గట్టే మన తెలుగు యువత కూడా తగ్గేదే లేదు అన్నట్టు దొరికిందే అదనుగా మామిడి పండ్లు లాగించేస్తారు. అయితే చాలా మంది అమ్మాయిలకు ఉండే భాధ ఏంటంటే, మామిడి పండ్లు తినడం తోనే మొహం మీద మొటిమలు వచ్చేస్తాయి అని.. కానీ ఇందులో నిజానిజాలు తెలుసుకోవడానికే తాజాగా ఒక పరిశోధన జరిగింది. ఈ  తాజా పరిశోధనల ప్రకారం మామిడి పళ్లలో ఉండే ప్రత్యేకమైన రసాయనాలు చర్మాన్ని మెరుగుపరచడంలో, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి అని వెల్లడైంది.

మామిడి లోని ఫైటోకెమికల్స్ (phytochemicals):

  • మామిడి పండ్లలో మ్యాంగిఫెరిన్ (Mangiferin) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని ఒత్తిడి (Oxidative Stress) ను తగ్గిస్తుంది.
  • బెటాకారొటిన్ (Beta-carotene), విటమిన్ C, పాలిఫెనోల్స్ వంటి పదార్థాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • ఇవి చర్మ కణాలను కొత్తగా తయారుచేసి ఇన్ఫ్లమేషన్ (వాపు), బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో సహాయపడతాయి.
  • అందుకే మామిడి పండు, మామిడి ఆకుల నుండి తయారుచేసే సారాన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులకంపెనీలు ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.

మామిడి తినడం వల్ల మొటిమలు ఎలా తగ్గుతాయి?

  • యాంటీఆక్సిడెంట్ గుణం: మామిడి లోని మ్యాంగిఫెరిన్, విటమిన్ C వంటి పదార్థాలు చర్మ కణాలలోని నష్టాన్ని తగ్గించి కొత్త కణాలు ఎదగడానికి సహాయపడతాయి. ఇది మొటిమలు తగ్గించడంలో సహకరిస్తుంది.
    • చర్మంపై కొత్త కణాల తయారీ పెంచడం.

  • యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం: మామిడి లోని ప్రకృతి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు చర్మం మీద వాపు, మచ్చ పడటం వంటి మొటిమల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
    • మొటిమల కారణంగా వచ్చే రంగు మార్పులు (Hyperpigmentation) తగ్గించడం.

  • బ్యాక్టీరియా నివారణ:
    మామిడి గుజ్జులో ఉన్న కొన్ని న్యూట్రియంట్లు బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటాయి, ఇది మొటిమల నివారణలో ప్రధాన పాత్ర పోషించే అంశం.
    • చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరచడం.

అయితే మామిడి మోతాదు ఎలా?

  • మామిడి పండు తినడం మొటిమల నివారణకు సహజ మార్గం అయితే, అధిక మోతాదులో తినడం వల్ల (ప్రతి రోజు 3-4 పండ్ల కంటే ఎక్కువ) దాంట్లోని చక్కెర వల్ల చర్మంపై నెగెటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది.
  • రోజుకు 1 చిన్న మామిడి (చిన్న రసం పండు) లేదా సగం పెద్ద మామిడి తినడం సరిపోతుంది.
  • మామిడి ఆకు సారం, లేదా రసాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి (స్కిన్ కేర్ ప్రాడెక్ట్స్  రూపంలో మాత్రమే).
  • వేసవి కాలంలో మామిడి తినడం సహజం. కానీ సరియైన మోతాదు పాటించాలి.
  • చర్మ సమస్యలున్నవారు మామిడి పైగా మామిడి ఆకుల వాడకం గురించి వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.

మామిడి పండు ఒకవైపు ఆరోగ్యానికి మేలు చేస్తే, మరొకవైపు చర్మ సమస్యలకు సహజమైన నివారణ. అయితే ఇది సరైన మోతాదు, సముచిత వాడకంతో మాత్రమే చర్మరోగ నివారణలో ఉపయోగపడుతుంది. అధికంగా తినడం మేలుకు మించిన నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి, ఆహారం + జీవనశైలి + వైద్య సలహా అనుసరించడం ఉత్తమ మార్గం.

Share your comments

Subscribe Magazine