ప్రస్తుత ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మనుషుల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ మరింత పెరిగింది. ఇక అన్ని రంగాల్లో పోటీతత్వం పెరిగిన నేపథ్యంలో కొంతమంది ఒత్తిడికి గురవుతున్నారు. బిజీ పరిస్థితుల్లో టెన్షన్ పడుతూ కొంతమంది తమ ఆరోగ్యం గురించి మరిచిపోతున్నారు. బయట ఏది పడితే అది తింటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు.
హోమ్ ఫుడ్ ఈజ్ ఆల్ వేస్ గుడ్ అని అంటారు. బయట మసాలా, ఫాస్ట్ ఫుడ్ తిని అరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు.. హోం ఫుడ్ కే చాలామంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసేవాళ్లు, హాస్టల్స్, రూమ్స్ లో ఉండే బ్యాచిలర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఫుడ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే రోజూ మనం తినే ఆహారంలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి. ఏది తింటే మంచిది అనే విషయాలు కూడా తెలుసుకోవడం మంచిది.
ఇప్పుడు ఉల్లిపాయ గురించి తెలుసుకుందాం. ఉల్లి లేనిది ఏ కూర వండలేము. ఏ కూర తయారుచేయాలన్నా.. ఉల్లి అనేది తప్పనిసరిగా కావాల్సింది. అది ఉల్లి నిత్యావసర సరుకుగా మారిపోయింది. ఉల్లి లేనిది వంటిట్లో ఏ పని జరగదు. కూరకు టేస్ట్ రావాలంటే.. అందులో ఉల్లి పడాల్సింది. కానీ ఉల్లిపాయ తినడం వల్ల కలిగే లాభాల గురించి చాలామందికి అవగాహన ఉండదు
ఉల్లిపాయ తినడం వల్ల చాలా అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందికి పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉంటుంది. బిర్యానీ తినేటప్పుడో, పెరుగన్నం తినేటప్పుడో పచ్చి ఉల్లిపాయను తింటూ ఉంటారు. ఇలా పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఉల్లి చేసే మేలు.. తల్లి కూడా చేయదనే సామెత మనకు తెలిసిందే. ఇది అక్షరాలా నిజం. పచ్చి ఉల్లిపాయను భోజనంలో కలిపి తీసుకుంటే చాలా మంచిదట. ఇలా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ అలెర్జీ తగ్గించడంతో పాటు రక్తపోటును నియంత్రిస్తుందట. ఉల్లిపాయల్లో ఉండే సి.బి, పొటాషియం రక్తపోటు సమస్యను పరిష్కరిస్తుందట.
ఉల్లిపాయలు యాంటీ బాక్టీరియల్ గా పనిచేస్తాయని, షుగర్ పేషెంట్స్ లో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ఇక ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉల్లిపాయను తరుచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మసంబంధ ఇన్పెక్షన్లు తగ్గుతాయట.
Share your comments