సాధారణంగా ఈ ప్రకృతిలో ఉండే ప్రతి మొక్కకు మనిషికి ఎంతో అవినాభావ సంబంధం ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రతి మొక్కను మనం సరైన విధానంలో ఉపయోగించుకుంటే ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ క్రమంలోనే మన చుట్టూ వాతావరణంలో పెరిగే నేల ఉసిరి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కలలో దాగి ఉన్న ఔషధ గుణాలు వాటి ప్రాముఖ్యత తెలిస్తే.. ఆశ్చర్యపోతారు. మరి ఈ నేల ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అవి దేనికి ఉపయోగపడతాయి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
నేల ఉసిరి మొక్క చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ చెట్టు వేరు నుంచి మొదలుకొని కాండం, ఆకులు, ఈ చెట్టు నుంచి కారేపాలు వరకు కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మొక్కలు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ నేల ఉసిరిని జ్యూస్ గా తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్, మలబద్ధకం, పొత్తి కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.
ఈ నేల ఉసిరిలో దాగి ఉన్న ఔషధాలు మన కిడ్నీలలో ఏర్పడిన రాళ్ళను కరిగించడమే కాకుండా అనేక రకాల మూత్రపిండాల వ్యాధులను దూరం చేస్తుంది. కామెర్లు వంటి వ్యాధులను నివారించడానికి నేలఉసిరి దోహదపడుతుంది.ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలోకి నేలఉసిరి ఆకురసాన్ని కలిపి తాగటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడే వారికి నేలఉసిరి ఎంతో అద్భుతమైన మొక్క అని చెప్పవచ్చు.
Share your comments