ప్రతి రోజు పాలను ఆహారంతో పాటు తీసుకోవాలని డాక్టర్లు మరియు నిపుణులు కూడా చెబుతూవుంటారు. ఎందుకు అనగా పాలు మంచి పౌషకాహారం, ప్రతి రోజు పాలను పిల్లలకు కచ్చితంగా తాగించాలి. పాలలో పుష్కలంగా ఉండే కాల్షియం మన ఎముకులను బల పరుస్తాయి. కానీ ఈ పాలు కూడా పిల్లలలో అనారోగ్యాన్ని కలిగిస్తుందని మీకు తెలుసా? పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ వాటిలో కలిపి తీసుకునే పదార్ధాల విషయంలో జాగ్రత్త వహించాలని నిపుణులు అంటున్నారు.
తల్లితండ్రులు పిల్లలకు తినిపించే ఆహార,ఎం విషయంలో చాలా జాగ్రత్త పడతారు. ఆరోగ్యకరమైన, షోషకాలతో కూడిన, రుచికరమైన, బలవర్థక ఆహారం ఇస్తుంటారు. ఏ మాత్రం తేడా చేసినా పిల్లలకు అజీర్తి, గ్యాస్, కోలిక్, వికారం, వాంతులు వంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే పాలతో పాటు కలిపి ఇచ్చే వాటి విషయంలో కూడా తల్లులు జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. పాలతో పాటు కొన్ని రకాల పదార్థాలు కలిపి తీసుకోవడం అనర్థాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం.
పాలతో పాటు సిట్రస్ ఫ్రూప్ట్స్ తీసుకోకూడదు. సిట్రస్ ఫ్రూప్ట్స్ అనగా నిమ్మా, ద్రాక్ష, నారింజ వంటి పండ్లను పాలతో కలిపి ఎట్టిపరిస్థితులలో తీసుకోకూడదు. ఒకవేళ ఇలా తీసుకుంటే కనుక కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. పాలు, పెరుగు తీసుకున్న రెండు గంటల తరువాత నువ్వులు, ఉప్పు పదార్ధాల్ని తీసుకుంటే మంచిది. అలాగని కలిపి ఒకేసారి తీసుకోకూడదు. అదే సమయంలో పనస, కాకరకాయల్ని కూడా పాలతో కలిపి తీసుకోకూడదు. ఆవిధంగా తీసుకోవడం వలన దురద, సోరియాసిస్ వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఇది కూడా చదవండి..
సముద్రపు చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి..కిడ్నీ సమస్యలు దూరం
పాలతో పాటు మినుములు మరియు మినపప్పు పదార్ధాలు కూడా తీసుకోకూడదు. మినుములో ఉండే పోషక పదార్ధాలు పాలతో గనుక కలిస్తే వంతులు, కడుపు బరువెక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అరటిపండ్లు, పాలు శరీరంలో టాక్సిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అరటిపండ్లు, పాలు కలిపి తీసుకోవడం వలన పిల్లల నిద్రపై ప్రభావితం చూపుతుంది. ద్రాక్ష వంటి ఆమ్ల పండ్లతో సంబంధంలోకి వచ్చినప్పుడు పాలలోని ప్రోటీన్ ఘనీభవిస్తాయి. ఇది జీర్ణకోశానొప్పి, అతిసారం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి..
Share your comments