Health & Lifestyle

ఒత్తిడిని తగ్గించే ముఖ్యమైన మినరల్స్... వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి....

KJ Staff
KJ Staff

ఒత్తిడి అందరికి సహజమే. ఆందోళన కలిగినప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలవుతుంది, ఈ హార్మోన్ ఒత్తిడికి కారణం. దీర్ఘకాలిక ఒత్తిడి మరియు అధిక కార్టిసోల్ లెవెల్స్ శరీరంలో పోషకాల సమతుల్యతను దెబ్బతియ్యడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. దీని ప్రభావం వలన పోషకాల లోపం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించేందుకు పోషకాలను అందించే కొన్ని ఆహారాల్ని సమపాలలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడిని సమగ్రవంతంగా నియంత్రించే కొన్ని ఆహారాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.

మెగ్నీషియం:

శరీరానికి మెగ్నీషియం అవసరం ఎంతో ఉంది. శరీర స్పందనకు దోహదపడే న్యూరోట్రాన్స్మిటర్స్ విడుదలలో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, దీనితోపాటు మానశిక స్థితిని స్థిరంగా ఉంచడంలో కూడా మెగ్నీషియం పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిని తగ్గించడంలో కూడా మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే మెగ్నీషియం సంవృద్ధిగా పొందడానికి అరటిపళ్ళు, జీడిపప్పు, మరియు బీన్స్ తినవలసి ఉంటుంది.

జింక్:

జింక్ మెదడుమీద ప్రాభవం చూపుతుంది. సరైన మొత్తంలో జింక్ తీసుకోవడం ద్వారా సమతుల మానశిక స్థితి ఏర్పడుతుంది. ఒత్తిడి సమయంలో అడ్రినలిన్ కూడా విడుదలవుతుంది, దీనిని నియంత్రణలో ఉంచడంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జింక్ స్ట్రెస్ లెవెల్స్ రెగ్యులేట్ చెయ్యడమే కాకుండా, మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జింక్ ఎక్కువగా బాదంపప్పు, గుమ్మడి గింజలు, చీస్, మరియు ముష్రూమ్స్ లో ఎక్కువుగా ఉంటుంది.

సెలీనియం:

శరీరంలో జరిగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడంలో సెలీనియం ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలో తగిన పరిమాణంలో సెలీనియం లేకపోతే థైరాయిడ్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. జీవక్రియ సరిగ్గా సాగడానికి మరియు ఒత్తిడి తగ్గడానికి సెలీనియం ఎంతగానో సహాయపడుతుంది. కోడి గుడ్లు, పచ్చి బాటని, బ్రోకలీ, మరియు మాంశంలో సెలీనియం అధికంగా ఉంటుంది.

సోడియం:

శరీరంలో విడుదలయ్యే అనేక హార్మోన్లను నియంత్రించడంలో సోడియం ప్రధానంగా పనిచేస్తుంది. దీనితోపాటు శరీరంలోని ద్రవ సమతుల్యతను కాపాడటంలో సెలీనియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే సముద్రపు ఉప్పు సోడియం కు అతి ముఖ్యమైన వనరు. దీనితోపాటు, సివీడ్ మరియు కిమిచి లో కూడా సోడియం ఉంటుంది.

పొటాషియం:

శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను మరియు వాటి పనితీరును నిర్ణయించేది పొటాషియం మాత్రమే. పొటాషియం హృదయనాళ స్థిరత్వం, సమర్ధవంతమైన హార్మోన్లు, మరియు రక్తప్రవాహం మీద పొటాషియం ముఖ్యమైన ప్రభావం చూపుతుంది. అరటిపళ్ళు పొటాషియం పొందడానికి ముఖ్యమైన వనరు.

Share your comments

Subscribe Magazine