Health & Lifestyle

శరీరంలో విటమిన్-డి లోపం ఉందని నిర్ధారించడం ఎలా?

KJ Staff
KJ Staff

ఎముకల పటుత్వానికి మరియు అనేక శరీర కార్యకలాపాలకు విటమిన్-డి ఎంతో అవసరం. ఈ విటమిన్-డి లోపిస్తే అనేక సమస్యలు తలెత్తుతాయి. మారుతున్న జీవన ప్రమాణాలు మరియు ఇతర కారణాల వలన ప్రస్తుతం చాలా మందిలో విటమిన్-డి లోపం కనిపిస్తుంది. విటమిన్- డి లోపం వలన కొన్ని మానశిక సమస్యలు తలెత్తడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని ఎన్నో రోగాలు రావడానికి కారణమవుతుంది. దీని లోపం వలన బోలు ఎముకుల వ్యాధి, రికెట్స్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. విటమిన్-డ్ లోపం వలన కండరాలు బలాన్ని కోల్పోతాయి, దీనితోపాటు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు కూడా ఉత్పన్నమవుతాయి.

చాలా మంది ఆహారం తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోని కారణంగా విటమిన్-డి లోపం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్-డి లోపం ఉందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. విటమిన్-డి లోపించడం వలన అలసట పెరిగి, ఒక్కసారిగా శక్తీ కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఎముకలు మరియు కండరాల నొప్పి ప్రారంభమవుతుంది. విటమిన్-డి లోపం శరీరంతోపాటు, మెదడు మీద కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్-డి లోపం వలన మానశిక కల్లోలం, ఎల్లపుడు విచారంగా ఉండటం, నిరాశ మరెన్నో సమస్యలకు కారణమవుతుంది.

విటమిన్-డీ లోపం మెదడులోని న్యూరోట్రాన్స్మీటర్లను దెబ్బతీస్తుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్లు భావోద్వేగాలను నియంత్రిస్తూ ఉంటాయి. విటమిన్-డి సరైన మొత్తంలో లేనప్పుడు ఈ న్యూరోట్రాన్స్మీటర్ల పనితీరును దెబ్బతీస్తాయి. దింతో మానశిక సమస్యలు మొదలవ్వడంతోపాటు, డిప్రెషన్ మరియు తలనొప్పికి కారణమవుతాయి.

అయితే ఈ విటమిన్-డి లభించడానికి ప్రధాన వనరు, సూర్యరశ్మి, ప్రతిరోజు సూర్యరశ్మిలో కొద్దీ సేపు ఉండటం ద్వారా శరీరానికి విటమిన్-డి లభిస్తుంది. కొన్ని రకాల ఆహార పదర్ధాల నుండి కూడా విటమిన్-డి పొందవచ్చు, ట్యూనా ఫిష్, గుడ్డు పచ్చసొన, మరియు పుట్టగొడుగులతో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్-డి లోపం ఉన్నవారు ఆహారం మీద ప్రత్యేక శ్రద్ద వహించి, ఈ లోపాన్ని నిర్ములించుకునే ప్రయత్నం చెయ్యాలి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలైనా సూర్యరశ్మి లభించేలా చూడాలి. ప్రతిరోజు పాలు మరియు పాల ఉత్పత్తులు క్రమం తప్పకుండ తీసుకోవాలి. వైద్యుల సూచనమేరకు విటమిన్-డి సప్లీమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

 

Share your comments

Subscribe Magazine