మన దగ్గర ఖర్భుజా పళ్ళు మహా అయితే కిలో 100 రూపాయలు ఉంటాయి .కానీ లక్షల్లో విలువ చేసే ఖర్భుజా పండు ఒకటి ఉందని మీకు తెలుసా. అవును అదే యుబరి కింగ్ మెలోన్ . దీని ప్రత్యేకత ఏంటో, ఎందుకు ప్రపంచమంతా ఇంత పాపులర్ అయిందో మొత్తం చదివి తెలుసుకొండి.
ప్రపంచం లో అత్యంత ఖరీదైన పండు ఏది అని సెర్చ్ చేస్తే యుబరి కింగ్ మెలోన్ అని కనిపిస్తుంది.వీటిని వేలం పాటలు వేసి మరి కొనుక్కుంటారు. 2022 లో జరిగిన ఒక వేలం పాట లో ఒక జత ఖర్భుజా పళ్ళు దాదాపు 18 లక్షలకు అమ్ముడయ్యాయి మరి.
అసలు వీటికి ఏదుకింత ధరో తెలుసా ?
అరుదైన పండ్లను ఉత్పత్తి చేయడం లో జపాన్ పెట్టింది పేరు. ఈ పండు ని కూడా జపాన్ లోని యూబారి గ్రామం లో , ప్రత్యేక గ్రీన్ హౌస్ కండీషన్స్ లలో పండిస్తారు.ఒక్కొక్క పండుని ప్రత్యేక శ్రద్ద తో పెంచుతారు.అందుకే ఇంత్ర్హ ధర. వీటిని వేరే ప్రాంతాలలో పండించినా కానీ యూబారి లో పండిన పళ్ళ రుచికి ఏ మాత్రం సరిపోదంట.
దీని రుచి, వాసన ఇతర ఖర్భుజా పండ్ల కంటే చాల ప్రత్యేకంగా,అత్యంత మధురంగా, ఉంటుంది.
యూబారి కింగ్ పండు కి ఉన్న మరో ప్రత్యేకత పండు తొక్క పై కనిపించే పీచు డిజైన్. ఈ డిజైన్ సరిగా తయారవ్వని పండ్లను అమ్మకానికి కూడా పెట్టరు అంట.
ఇన్ని ప్రత్యేకతలు మరియు మీడియా అందించిన publicity కూడా తోడయ్యి ఈ పండు ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఈ పండుని తినడానికి కాకుండా బహుమతులుగా ఇవ్వడనికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఇది కూడా చదవండి
Share your comments