నేటి కాలంలో ప్రతి ఒక్కరికి ఒత్తిడి పెరిగిపోయింది. దానితోపాటు పిల్లలు మరియు పెద్దలు కూడా ఎక్కువ సమయం ఫోన్లు, టీవీ చూడటంలోనే గడిపేస్తున్నారు. ఇలాంటి పనుల కారణంగా నేటికాలం ప్రజలలో కంటి చూపు పాడవుతుంది. నేటి యువత కూడా ఎక్కువ సమయం ఫోన్లు వాడటం వలన నిద్ర సరిగా లేకపోవడం వంటి వాటి వల్ల కంటిచూపు తక్కువ వయసులోనే మందగిస్తుంది. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే ఆహారాన్ని తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది.
చేపలు మన కంటి చూపును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ చేపల్లో ముఖ్యంగా సాల్మన్ వంటి చేపలను బాగా తినాలి. ఎందుకంటే ఈ చేపల్లో ఎక్కువగా ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు మన కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడతాయి. చేపలను తినడం వలన రెటీనా కూడా బాగుంటుంది. వీటితో మనకు కళ్ళు పొడిబారడే సమస్య కూడా తగ్గుతుంది.
కోడిగుడ్లు కూడా మన కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కోడిగుడ్లలో విటమిన్ A, లూటీన్, జియాక్సంతిన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కార్నియాను కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. లూటీన్, జియాక్సంతిన్ తీవ్రమైన కంటి సమస్యలు రాకుండా చూస్తాయి. జింక్ రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇది కూడా చదవండి..
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త: అమృత్ కలశ్ పునరుద్ధరించిన ఎస్బీఐ..
కంటికి ఆరోగ్యకరమైన ఆహారాల్లో క్యారెట్లు కూడా ఒకటి. వీటిలో విటమిన్ A, బీటా కెరాటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అవసరం. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవడంలో ఇవి ముందుంటాయి. క్యారెట్లను సలాడ్లు, సూపులుగా మార్చుకొని తింటే మంచిది.
ప్రతి రోజు మన ఆహారంలో భాగంగా బాదంపప్పును తప్పకుండా తీసుకోవాలి. ఎందుకనగా బాదంపప్పులో అధికంగా విటమిన్ ఏ కలిగి ఉంటుంది. వీటిని ప్రతిరోజు తినడం వలన మన శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. విటమిన్ ఏ అధికంగా ఉండడంతో మన కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
ప్రతి రోజు పైన సూచించిన వాటిని తినడం ద్వారా మన కంటి చూపును మెరుగుపరుచుకోవచ్చు. మనం ప్రతి రోజు తినే ఆహారంతో వాటిని తీసుకోవడం వాళ్ళ మంచి ఫలితాలు వస్తాయి.
ఇది కూడా చదవండి..
Share your comments