వేసవికాలంలో వేడిని తట్టుకోవడానికి నీరు మరియు ఇతర పానీయాలు సహాయపడతాయి. ఎండ వలన వేడికి పానీయాలు అన్ని చల్లగా ఉండేలా చూసుకుంటారు. వేడికి శరీరం నుండి నీరు ఎక్కువగా కోల్పోవడం వలన దాహార్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రజలు ఫీజ్ లో నిల్వ ఉంచిన నీరు తాగేందుకు ఎంచుకుంటారు. అయితే చల్లటి నీరు ఆరోగ్య సమస్యలు తలెత్తేలా చేస్తుంది. చల్లటి నీరు తాగడం వలన అప్పటికి ఊరట లభించిన తర్వాత కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చాలా మందికి భోజనం చేసిన వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది, ఇలా చేయడం మంచికాదని మన పెద్దలు హెచ్చరిస్తారు, అందులోనూ చల్లటి నీటిని భోజనం తర్వాత తాగితే దాని ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. చల్లటి నీరు మనం తీసుకున్న ఆహారంలో కొవ్వు కరగకుండా పేరుకుపోవడానికి కారణమవుతుంది. వీటిని జీర్ణం చెయ్యడానికి శరీరానికి కష్టంగా ఉంటుంది.
స్పోర్ట్స్ ఆడేవారు, లేదా జిమ్ములకు వెళ్లి కసరత్తు చేసే సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగి, శరీరం అధికంగా శ్రవించి అధికంగా దాహం వేస్తుంది. ఇటువంటి సమయంలో చల్లటి నీరు తాగడం చాల ప్రమాదకరం. నీరు మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించగలదు, కసరత్తు చేసాక శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది, ఈ సమయంలో చల్లటి నీరు తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి అసమతూల్యత కలగవచ్చు. మండుటెండలు నుండి ఉపశమనం పొందడానికి, మజ్జిక లేదా నిమ్మకాయ నీరు ఐస్ వాటర్ కలపకుండా తీసుకోవడం మంచింది. కుండలోని నీళ్లు చల్లగాను మరియు సరైన ఉష్ణోగ్రతను కలిగిఉంటాయి వాటిని తాగడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండచ్చు.
Share your comments