ఏ పని చెయ్యాలన్నా ఆచి తూచి చెయ్యాలని మన పెద్దలు చెబుతారు. అయితే ఒక్కసారి అధికంగా ఆలోచించడం కూడా ముప్పు తీసుకురావచ్చు. ఆలోచనలు ఎక్కువైతే తల మీద భారం పెరిగిపోతుంది. కొంతమంది ప్రస్తుతం ఏమి జరుగుతుందన్న ఆలోచనను పక్కన పెట్టి, భవిష్యత్తు ఆలచనలతో ములిగిపోయి ఉంటారు. ఆలోచనలను అతిగా ఉంటే నియంత్రించుకోవడం చాలా ముఖ్యం లేదంటే ఎన్నో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతానికి మరియు భవిష్యత్తును ఆలోచనలు ముడిపడి ఉండటం వలన మెదడు పై ఒత్తిడి పెరిగిపోతుంది. అతిగా వచ్చే ఆలచనలను నియంత్రించడానికి కూడా కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒకపని చేసే ముందు ఆలోచించడం మంచిదే కానీ, అదే ఆలోచనలు ఎక్కువుగా ఉంటే మెదడు మీద భారం పెరిగిపోతుంది. ఈ భారం ఒత్తిడిగా మారి క్రమంగా బలమైన ఒత్తిడిగా మారిపోయి మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం. అతిగా ఆలోచన మనిషిని మానశికంగా కూడా కృంగదీస్తుంది. అప్పుడైనా ఆలచనలు ఎక్కువై, ఒత్తిడి కలుగుతుంది అన్న సందర్భంలో లోతైన శ్వాస తీసుకోవాలి. ఆలోచనల మీద నియంత్రణ ఉండేందుకు ప్రతీ రోజు ధ్యానం చెయ్యడం అలవాటు చేసుకోవాలి.
ప్రతీ రోజు ధ్యానం చెయ్యడం ద్వారా ఆలోచనల మీద మరియు భావోద్వేగాల మీద పట్టు లభించి, వాటికి బానిసలుగా మారకుండా ఉండేందుకు వీలుంటుంది. పనిలో నిమగ్నమై ఉండటం వలన కూడా అధికంగా వచ్చే ఆలోచనలను కట్టడి చెయ్యవచ్చు. ఆలోచనలు ఎక్కువుగా రావడానికి మరొక్క ప్రధాన కారణం ఒంటరితనం. ఆలోచనలు అదుపుతప్పినప్పుడు ఇంట్లోంచి పార్క్, లేదా ఏదైనా జనసంచారం ఉన్న ప్రదేశానికి వెళ్లడం ద్వారా, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఏదైనా సమస్య వచిన్నపుడు వాటికి కృంగిపోకుండా, ప్రశాంతంగా వాటికి పరిస్కారం ఆలోచించాలి. సమస్యను చూసి భయపడుతూ కూర్చుంటే ఏమి చేయలేము అని మనకి మనము సర్ది చెప్పుకొని దానిని పరిష్కరించే మార్గాల మీద ద్రుష్టి పెట్టాలి. దీనితోపాటు ప్రతిరోజు వ్యాయామం చెయ్యడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం ద్వారా శారీరిక శ్రమ కలిగి మానశిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
Share your comments