ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైనా తరువాత, ఫ్రోజెన్ ఫుడ్స్ కి గిరాకీ అంతకంతకు పెరుగుతుంది. కొన్ని ఆహార పదర్ధాలు కొన్ని సీసాన్లలో మాత్రమే మనకి లభిస్తాయి. అయితే ఆహారని ఫ్రీజ్ చెయ్యడం ద్వారా అన్ని కాలాల్లోనూ వాటి రుచిని ఆస్వాదించవచ్చు. ఫ్రీజ్ చేసిన బఠాణీలు కూడా ఈ త్రోవలోకే వస్తాయి. బఠాణీలు శీతాకాలంలోనే ఎక్కువగా లభ్యమవుతాయి. అదే పచ్చి బఠాణీలను ఫ్రీజ్ చేస్తే వాటిని ఏడాది మొత్తం ఉపయోగించుకోవచ్చు.
ఫ్రీజ్ చేసిన ఆహారాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వచెయ్యవచ్చు. తొందరగా పాడైపోయే మాంశం, చేపలు, మరియు బఠాణి వంటి వాటిని ఫ్రీజ్ చెయ్యడం ద్వారా వీటిని ఎక్కువ కాలం నిల్వచెయ్యవచ్చు. అయితే బఠాణీలను ఫ్రీజ్ చేసిన తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఫ్రీజ్ చేసే తినడం ద్వారా వీటి రుచిని సంవత్సరం మొత్తం ఆస్వాదించగలిగినా వీటి వల్ల అనేక దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఎక్కువ. ఫ్రీజ్ చేసిన బఠాణీలను తినడం ద్వారా కలిగే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రీజ్ చేసిన బఠాణీలను ఆహారలో ఉపయోగిస్తే తొందరగా బరువు పెరగడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే పచ్చి బఠాణీలను ఫ్రీజ్ చెయ్యడం కోసం స్టార్చ్ ఉపయోగిస్తారు. స్టార్చ్ ఉపయోగించడం ద్వారా శరీరంలో చెడు కొవ్వు వేగంగా పేరుకుపోతుంది. దీనివలన గుండెకు సంబంధించిన వ్యాధులు ఎక్కువవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మరియు గుండె వ్యాధులు ఉన్నవారు, ఫ్రోజెన్ బఠాణీలను తినడం మానేస్తే మంచిది.
ఫ్రీజ్ చెయ్యని బఠానీలతో పోలిస్తే ఫ్రీజ్ చేసిన వాటిలో పోషకాలు చాలా తగ్గిపోతాయి. ఫ్రీజర్లో ఎక్కువకాలం వీటిని నిల్వచెయ్యడం ద్వారా వీటిలో పోషకాలు పూర్తిగా నశించిపోవడానికి అవకాశం ఎక్కువ. అంతేకాకుండా ఫ్రీజ్ చేసిన బఠానీల్లో పిండి పదర్థం ఎక్కువవడం వలన రక్తంలో చెక్కెర స్థాయి అమాంతం పెరిగిపోతుంది. దీనితోపాటు ఫ్రీజ్ చేసిన బఠాణీలు వలన రక్తపోటు కూడా పెరుగుతుంది, కాబట్టి షుగర్ మరియు బీపీ ఉన్నవారు ఆహారంలో ఫ్రీజ్ చేసిన బఠాణీలను తినడం మానెయ్యాలి. వీటికి బదులు ఫ్రెష్ గా మార్కెట్లో దొరికేవి తినడం ఉత్తమం.
Share your comments