ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తో పోరాడుతుంది కొత్తగా మరికొన్ని వైరస్లు వ్యాప్తి చెందుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటి వ్యాధులు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టాయి. ఇదిలా ఉండగా తాజాగా మరి కొత్తగా నోరో వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలను మరింత భయబ్రాంతులకు గురి చేస్తోంది. అసలు ఈ
నోరో వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది? ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం...
బ్రిటన్ లో ఒక్కసారిగా నోరో వైరస్ కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి.నోరో వైరస్ని స్టమక్ ఫ్లు లేదా స్టమక్ బక్ అని కూడా పిలుస్తారు.ఇది ఇన్ఫ్లూయెంజా వైరస్ ద్వారా వచ్చే జ్వరం లాంటివి కాదని నిపుణులు తెలిపారు. ఈ నోరో వైరస్ కూడా కరోనా వైరస్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది.ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులు తాకిన వస్తువులను లేదా వారు ఉపయోగించిన వస్తువులను ఇతరులకు ఉపయోగించడం వల్ల తొందరగా ఈ వ్యాధి వ్యాప్తి జరుగుతుంది.
ముఖ్యంగా ఈ నోరో వైరస్ ఎక్కువగా చిన్న పిల్లలలో వ్యాప్తి చెందుతుంది. అందుకోసమే ఎల్లప్పుడు మన పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రమైన ఆహారం, నీటిని తీసుకోవడం వల్ల ఈ వ్యాధి నుంచి దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా ఈ వ్యాధి బారిన పడిన వారిలో ఎక్కువగా వాంతులు, విరోచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ కి పరిశుభ్రత ఒక్కటే మందు అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కరోనా వైరస్ మాదిరిగానే వ్యాప్తి చెందినా కరోనా వైరస్ అంత ప్రాణాంతకం కాదని,కాకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.
Share your comments