గుండెపోటు రావడానికి అనేక కారణాలున్నాయి, అయితే ఈ మధ్య కాలంలో గుండెపోటు భారిన పడేవారు మరియు గుండెపోటుతో మరణించేవారు సంఖ్య ఎక్కువుగా మారింది. చిన్న వయసు ఉన్నవారిలో కూడా ఈ గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. అదృష్టవశాత్తు ఒక్కసారి గుండెపోటు వచ్చి బయటపడిన వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒక్కసారి గుండెపోటు వస్తే రెండో సారికూడా వచ్చే ప్రమాదం ఎక్కువ. వైద్యులు సూచించిన మందులు క్రమంతప్పకుండా వాడటంతో పాటు, గుండెపోటుభారిన పడిన వ్యక్తి జీవనవిధానంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్ తరువాత తీసుకునే ఆహారంలో ఎంతో జాగ్రత్త పాటించాలి.
గుండెపోటు నుండి కోలుకున్న తరువాత ఆహారంలో ఎక్కువ మొత్తంలో తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఫైబర్ ఆహారం మొత్తం జీర్ణమయ్యేలా చేయడంతోపాటు, రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కూడా తొలగిస్తుంది. గుండె జబ్బులు రావడానికి అధిక బరువు ఒక కారణం. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడం వలన బరువు కూడా తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అన్నానికి బదులు, ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ వంటి వాటిని తినడం ఉత్తమం, ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిచడంతోపాటు ఫైబర్ని కూడా అందిస్తాయి. రోజువారీ ఆహారంలో తాజా పళ్ళు మరియు కూరగాయలను ఒక భాగం చేసుకోవాలి, ఏవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో తోడ్పడతాయి. మాంసాహారంలో చికెన్ మటన్ బదులు చేపలు తినడం గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే క్రమం తప్పకుండ డ్రై ఫ్రూప్ట్స్ కూడా తినడం అలవాటు చేసుకోవాలి.
ప్రస్తుతం గుండె జబ్బులు ఎక్కువవ్వడానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్స్. ప్రజలు జంక్ ఫుడ్స్ కి ఎక్కువుగా అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. గుండె జబ్బులు వచ్చి కోలుకున్న తరువాత జంక్ ఫుడ్స్ తినడం మానెయ్యడం మంచిది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలకు కూడా కాస్త దూరంగా ఉండాలి. చెక్కర గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం, ఎక్కువ చెక్కెర ఉండే చాక్లేట్లు, ఐస్క్రీమ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ మరియు అన్ని బేకారి ఐటమ్స్ కి దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువుగా ఉండేలా చూసుకోవాలి. బయట ఫుడ్స్ కి స్వస్తి చెప్పి ఇంటివద్ద తయారుచేసిన ఆహారాన్నే తినేందుకు ప్రయత్నించాలి.
గుండెపోటు నుండి కోలుకున్న తరువాత గుండె పనితీరు కాస్త తగ్గుతుంది, కాబట్టి దీని నుండి కోలుకున్న తరువాత ఆహారపు అలవాట్లతోపాటు జీవన విధానాల్లో కూడా మార్పు అవసరం. వైద్యులు సూచించిన మందులు క్రమంతప్పకుండా వాడుతూ ఉండాలి, దీంతోపాటు వారానికి ఒకసారి బ్లడ్ ప్రెషర్, మరియు కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఈసిజి పరీక్ష చేపించుకోవాలి, దీనివలన గుండె పనితీరు తెలుస్తుంది. ఆల్కహాల్, స్మోకింగ్ వంటి చెడు వ్యసనాలకు స్వస్తి చెప్పి, ప్రతి రోజు వాకింగ్ చెయ్యడం ప్రారంభించాలి. ప్రతిరోజు కనీసం 45 నిమిషాలైనా నడవాలి. గుండె పై పని ఒత్తిడి మరియు మానసిక ఒత్తిడి పడకుండా ఉండేందుకు ప్రతి యోగ, మెడిటేషన్ చెయ్యడం ప్రారంభించాలి.
Share your comments