సాధారణంగా చాలా మంది చెవిలోకి నీళ్లు వెళ్ళాయానో లేదా చెవిలో దురదగా ఉందనో చెప్పి చెవిలో కాటన్ బడ్స్ (దూది పుల్లలు పెడుతుంటారు). దీనివలన చాలా ప్రమాదమని వైద్యులు చెబుతుంటారు. నిజానికి చెవి బయట భాగాన్ని తప్ప లోపలి భాగాన్ని శుభ్రం చెయ్యవలసిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. మరి కాటన్ బడ్స్ చెవిలో పెడితే కలిగే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శరీరంలో అతి సున్నితమైన భాగం, అలాగే ముఖ్యమైన భాగం కూడా చేవే. చెవిలో సహజంగా తయారయ్యే ఇయర్ వాక్స్ లేదా గులిమిను తియ్యడానికి చాలా మంది దూది పుల్లలను వినియోగిస్తుంటారు. కొంతమందైతే పేపర్లు, పిన్నీసులు, మరియు గుడ్డ ముక్కలతో చెవిలోని గులిమిని తీస్తుంటారు. ఇలా చెయ్యడం ద్వారా చెవి లోపలి భాగం దెబ్బతినడం, లేదా ఇన్ఫెక్షన్లు రావడం జరుగుతుంది. అయితే ఇయర్ వాక్స్ ద్వారా చెవికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కాటన్ బడ్స్ పెట్టడం ద్వారా చెవిలోని గులిమి మరింత లోపలి పోతుంది. దీనివలన శబ్డాలను గ్రహించే ఇయర్ డ్రమ్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ కాటన్ బడ్స్ కర్ణభేరికి తగలడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.
ఇయర్ వాక్స్ దవారా చెవికి లాభమే కానీ నష్టమేమి లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది ఉండటం వలన కర్బేరివద్దకు దుమ్ముధూళి చేరకుండా రక్షిస్తుంది. బయటనుండి ఇతర పదర్ధాలు మరియు క్రిములు వంటివి చెవిలోకి పోకుండా నివారిస్తుంది. అంతేకాకుండా శిలింద్రాలు లేదా ఫంగస్ వంటివి ఏర్పడకుండా చెవిని రక్షిస్తుంది. ఇయర్ వాక్సలోని తేమ చెవి లోపలి భాగం పొడిబారకుండా రక్షిస్తుంది. కాబట్టి చెవిలో గులిమి ఉందికాదాని ఎల్లప్పుడూ చెవిలో ఇయర్ బడ్స్ పెట్టకుండా ఉండటం మంచిది. చెవిలో గుళుమ్ మరిఎక్కువుగా ఉన్నా, లేదా శబ్దాలు వినిపించకపోయినా ఇయర్ స్పెషలిస్ట్ ని సంప్రదించడం మంచిది.
Share your comments