దేశంలో రోజురోజుకు షుగర్ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ విధంగా షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగి పోవడానికి గల కారణం మారుతున్న జీవన శైలి అని చెప్పవచ్చు. ఒకసారి మధుమేహం బారిన పడ్డా మంటే జీవితాంతం మందుల ద్వారా షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు ఆహారంలో భాగంగా చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పవచ్చు.
ఇంటర్మీడియట్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యాసిడ్ ట్రాపిక్ చేసిన పరిశోధనల ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలు12 నుంచి15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మిల్లెట్ యొక్క సగటు గ్లైసెమిక్ సూచిక 52.7 శాతం అని శాస్త్రవేత్తలు చెబుతుండగా గోధుమల కంటే 30 శాతం తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చక్కెర వ్యాధిని సాధారణ స్థాయిలో ఉంచడానికి చిరుధాన్యాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు.ముఖ్యంగా చైనా అమెరికా ఇండియా దేశాలలో ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే ఈ వ్యాధి నుంచి ఎలాంటి ప్రమాదకర సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ఆహారంలో భాగంగా చిరు ధాన్యాలకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలని తెలిపారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా కాకుండా పూర్తిగా మన ఆహార విషయంలో, జీవనశైలిలో మార్పులు చోటు చేసుకున్న అప్పుడే ఈ మధుమేహం బారినుంచి విముక్తి పొందవచ్చు అని చెప్పవచ్చు.
Share your comments