ఇంట్లో ఏమైనా శుభకార్యాలు, లేదా ఏమైనా ఫంక్షన్లకు వెళ్లాలంటే, బ్యూటీ పార్లోర్ కి వెళ్లి పేస్ ప్యాక్స్ వేయించుకుంటారు. హానికారక కెమికల్స్ తో తయారుచేసిన ఈ బ్యూటీ ప్రోడక్టులు కొన్ని సార్లు స్కిన్ అలెర్జిస్ కలిగించవచ్చు. ఇలా కాకుండా సజసిద్ధంగానే ఇంట్లో తయారుచేసిన పేస్ ప్యాకులు వినియోగించడం ద్వారా అతి తక్కువగా రోజాల్లో మొఖాన్ని మెరిపించవచ్చు. వీటివలన చర్మానికి ఎటువంటి హాని ఉండదు, పైగా వీటికయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇంట్లో తయారుచేసుకునే ఈ ఫేస్ ప్యాకుల ద్వారా మొఖంపై మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారే పోకపోయిన ఈ ఫేస్ ప్యాకును తరచూ వాడటం ద్వారా ఈ మచ్చలను పూర్తిగా తగ్గించవచ్చు.
అదే విధంగా మొఖానికి త్వరగా కాంతిని అందించడం కోసం, బియ్యం పిండి, రెండు స్పూన్ల రోజ్ వాటర్, మరియు ఒక స్పూన్ తేనే వేసి, దీనిని ఒక మిశ్రమంలా తయారుచేసి, మొఖానికి పట్టించాలి. ఈ పేస్ ప్యాక్ ను అరగంట సేపు వదిలేసి, తరువాత శుభ్రమైన నీటితో కడిగితే ముఖానికి త్వరగా మెరుపు వస్తుంది. మెడ నలుపు రంగులో ఉండేవారు కూడా ఈ మిశ్రమాన్ని వినియోగించవచ్చు.
Share your comments