Health & Lifestyle

అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలు

KJ Staff
KJ Staff
Healthy Vegetables
Healthy Vegetables

సాధారణంగా మనం రోజూ ఏదో ఒక ఆకుకూర లేదా కూరగాయలతో కూర చేసుకొని తింటుంటాం. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. కూరగాయల్లో, ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

విటమిన్లు, ఇతర పోషకాలు అన్నింటిలోనూ ఉన్నా.. కొన్ని మాత్రం ప్రత్యేకం అని చెప్పుకోవాలి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల పోషకాహార లోపం లేకుండా జాగ్రత్త పడే వీలుంటుంది. ఇందుకోసం కొన్ని కూరగాయలు మాత్రమే పనిచేస్తాయి. ఆ కూరగాయల గురించి తెలుసుకుందాం.

పాలకూర

మాంసాహారం తినని వారికి, డెయిరీ ఫ్రీ ఫుడ్ తినే వారికి ఇది ఐరన్ అందించే ముఖ్యమైన సోర్స్ అని చెప్పుకోవచ్చు. కప్పు పాలకూరలో కేవలం ఏడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ కె ఉంటుంది. ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది శరీరం క్యాల్షియంని స్వీకరించే శక్తిని పెంచుతుంది. ఇది బీపీని తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. పాలకూరను సలాడ్లు, బర్గర్లు, కూరలు, జ్యూస్ లు ఇలా వివిధ రకాలుగా తీసుకోవచ్చు. ఇది పాస్తా వంటకాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. సూప్ లలో కూడా దీన్ని చేర్చుకోవడం వల్ల రుచి పెరుగుతుంది.

బ్రొకలీ

కూరగాయలన్నింటిలో పోషకాలు నిండినది బ్రొకలీ. క్యాబేజీ, కేల్, కాలీఫ్లవర్ ల కుటుంబమైన క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందినది బ్రొకలీ. కానీ వాటన్నింటి కంటే ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కప్పు ఉడికించిన బ్రొకలీలో 31 క్యాలరీలు ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల రోజుకు కావాల్సిన విటమిన్ కె మన శరీరానికి అందుతుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ సి కి రెట్టింపు అందుతుంది. ఇందులో ఐసో థియోసైనేట్, ఇండోల్స్ వంటి కూరగాయలు కూడా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ని అడ్డుకుంటాయి. వివిధ అవయవాలు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు శరీరాన్ని కాపాడతాయి. దీన్ని ఉడికించి లేదా బేక్ చేసి, గ్రిల్ చేసి, సూప్ లలో భాగంగా లేదా సలాడ్స్ లో కూడా తీసుకోవచ్చు.

క్యాప్సికమ్

చాలామందికి ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. ఇవి పెద్దగా రుచి ఉండవు. మరికొన్ని తియ్యగా ఉంటాయి. కప్పు ఎర్ర క్యాప్సికమ్ లో 39 క్యాలరీలు ఉంటాయి. 190 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. 0.434 మిల్లీగ్రాముల ఫోలేట్ ఉంటుంది. వీటితో పాటు బీటా కెరోటిన్, విటమిన్ బీ6, విటమిన్ ఎ కూడా ఉంటాయి. అంతేకాదు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ కెమికల్స్ కూడా ఉంటాయి. ఆస్కార్బిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, విటమిన్ సి, బీటా కెరోటిన్, క్విర్సెటిన్, కెంప్ ఫెరాల్ అనే కెరాటిన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని సలాడ్లలో వేసుకునేందుకు, అన్ని కూరల్లోనూ ఉపయోగించవచ్చు. గ్వాకమోల్ వంటి వాటితోనూ తీసుకోవచ్చు.

బీట్ రూట్

కప్పు పచ్చి బీట్ రూట్ లో 58.5 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 442 మిల్లీగ్రాముల పొటాషియం కూడా ఉంటుంది. 148 మైక్రోగ్రాముల ఫోలేట్ కూడా ఉంటుంది. ఇందులో గుండె ఆరోగ్యాన్ని ఎక్కువగా కాపాడే నైట్రేట్స్ కూడా ఉంటాయి. బీట్ రూట్ జ్యూస్ గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా ముఖ్యమైనది. రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్త పోటు తగ్గినట్లు ఓ అధ్యయనంలో కూడా తేలింది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. వీటిలో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ నరాల సమస్యలు ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. డయాబెటిక్ న్యూరోపతి సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిని రోస్ట్ చేసుకొని, కూరగా, జ్యూస్ రూపంలో, సలాడ్ గా, శాండ్ విచ్ లలో తీసుకోవచ్చు.

వెల్లుల్లి

వెల్లుల్లి ఒక మందులాంటిది అని చెప్పుకోవచ్చు. ఒక వెల్లుల్లిలో కేవలం నాలుగు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. 16 శతాబ్దం నుంచి వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులోని మెడిసినల్ గుణాలే ఇందుకు కారణం అని చెప్పుకోవచ్చు. వెల్లుల్లిని పచ్చిగా సలాడ్లలో ఉపయోగించవచ్చు. డిప్స్, రిసొట్టోస్, కూరల్లో కూడా వాడవచ్చు. ఇందులో ప్రొబయోటిక్స్ కూడా ఉంటాయి. అందుకే ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు తోడ్పడుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, డయేరియా వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. దీన్ని పులియబెట్టి తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలుంటాయి. ఇందు కోసం కావాలంటే క్యాబేజీ, కీర దోస, క్యారెట్, బీట్ రూట్, కాలీ ఫ్లవర్ వంటివి కూడా దీనికి జోడించవచ్చు.

సీ వీడ్

ఇది చాలా పోషకాలు నిండిని మొక్క అని చెప్పవచ్చు. ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వీటిని సీ వెజిటెబుల్స్ అని పిలుస్తారు. మొక్కల్లో డోకోసాహెక్సనోయిక్ యాసిడ్, ఐకో సాపెంటనోయిక్ యాసిడ్ లను అందించే మొక్క కేవలం సీ వీడ్ ఒక్కటే. ఇవి రెండు శాకాహారంలో అత్యంత అరుదుగా లభించే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు.. ఇవి కేవలం డైరీ ఉత్పత్తులు, మాంసాహారంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం కూడా. వీటిలో అయోడిన్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి సెల్యులార్ డ్యామేజ్ ని తగ్గిస్తాయి. అంతే కాదు.. యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇందులో క్లోరోఫిల్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని యాంటీ ఇన్ ఫ్లమేటరీ డైట్ లో భాగంగా ఉపయోగించవచ్చు. ఆకుపచ్చగా కాకుండా బ్రౌన్ రంగులో ఉండే సీ వీడ్ లో ఫూకో జాంథిన్ అనే రకం యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. కెల్ప్, వకామే అనే రకాల్లో ఎక్కువగా ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ ఇ తో పోల్చితే 13.5 రెట్లు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.

రోజూ కనీసం 5 సర్వింగ్ ల కూరగాయలు తినేవారిలో ఆరోగ్య సమస్యలు అంత త్వరగా దరిచేరలేవట. క్యాన్సర్, గుండె జబ్బు వంటి వ్యాధుల ముప్పు ఉండదు. పోషకాలు కూడా అందుతాయి.

https://krishijagran.com/health-lifestyle/remove-98-pesticides-from-fruits-vegetables-at-home-by-this-method/

https://krishijagran.com/agriculture-world/coronavirus-pandemic-best-way-to-clean-fruits-and-vegetables-before-eating/

Share your comments

Subscribe Magazine