ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ జీవనాన్ని ఎక్కువగా ఎలక్ట్రిక్ తో గడుపుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం తినే పదార్థాలు, వాడే వస్తువులన్ని ఎలక్ట్రిక్ నుండి తయారవుతున్నాయి. ముఖ్యంగా తాగే వేడి నీళ్లను కూడా కరెంటు ద్వారానే తయారు చేసుకుంటున్నాం. స్నానం చేసే వేడి నీళ్లు కూడా కరెంటు తోనే వస్తుంది. ఇక తినే అన్నం కూడా ఎలక్ట్రిక్ కుక్కర్ నుండే తయారు చేసుకుంటున్నాం. వీటికి తోడుగా మనకు వ్యసనంగా మారిన ఫోన్ కూడా ఒక పరంగా ఎలక్ట్రిక్ అనే చెప్పవచ్చు.
నిజానికి ఇవన్నీ వాడుకలోకి వచ్చినప్పటి నుండి ప్రజల్లో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయని చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో ఇటువంటివన్నీ లేవు. అందుకు వాళ్ళు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న కాలంలో చిన్న వయసులోనే శరీరం నొప్పులన్ని బాధపడుతున్నారు. దీనికి కారణం ఎలక్ట్రిక్ అని కచ్చితంగా చెప్పాలి. పట్టణాల్లోనే కాకుండా గ్రామాలలో కూడా ఎలక్ట్రిక్ వాడుకలు ఎక్కువగా వచ్చాయి. ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, గ్రైండర్ ఇలా ఎన్నో రకాలు ప్రజలకు అలవాటుగా మారాయి.
వీటి వల్ల చాలామంది సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ వీటివల్ల జీవితం అనేది సేవ్ చేసుకోలేం. ఇప్పటికి ఎంతో మంది వైద్య నిపుణులు విద్యుత్ తో తయారైన పదార్థాలను తీసుకోవద్దని చాలాసార్లు తెలిపారు. కానీ వీటి వాడుక మాత్రం ఎక్కువైంది తప్ప తగ్గటం లేదని చెప్పవచ్చు. ఇక ఎలక్ట్రిక్ కుక్కర్ వల్ల మరింత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇందులో అన్నం వండటం వల్ల విషం గా మారుతుందని.. కారణం అన్నం వండే పాత్ర అల్యూమినియంతో తయారు చేయడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని తెలిపారు.
అందులో అన్నం వండకూడదని పైగా ఎక్కువసేపు నిల్వ చేయడం కూడా మంచిది కాదని దీనివల్ల ఫుడ్ పాయిజన్ వంటివి మరియు కొన్ని సంవత్సరాల తర్వాత విష ప్రభావాలు బయటపడతాయని తెలిపారు. ఇందులో వండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఉదర సంబంధ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లవాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, శరీర నొప్పులు వంటివి ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తున్నారు.
Share your comments