Health & Lifestyle

నాన్-స్టిక్ ప్యాన్లు ఉపయోగిస్తున్నవారు ఈ జాగ్రత్తలు పాటించండి.....

KJ Staff
KJ Staff

మునపటిరోజుల్లో ఇప్పటిలాగా గ్యాస్ స్టవ్ లు లేవు, కేవలం కర్రపొయ్యలు మరియు మట్టి పాత్రలు మాత్రమే ఉండేవి. మట్టి పాత్రల్లోనే వాడుకుని వాటిలోనే తిన్న వారే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు, కానీ కాలం మారుతున్నకొద్దీ గ్యాస్ స్టవ్ లు మరియు ఎలక్ట్రిక్ స్టవ్ లు అందుబాటులోకి వచ్చాయి, వీటితోపాటు నాన్-స్టిక్ వంట పాత్రలు కూడా వాడుకలోకి రావడం జరిగింది. నాన్-స్టిక్ ప్యాన్లో వేసిన పదార్ధాలు పాత్ర అడుగుభాగానికి అంటుకోవు, అలాగే ఆహార పదార్ధం బాగా కాలి వంట రుచిగా ఉంటుంది.

కాకపోతే నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎలా వాడాలో తెలియకపోవడం చేత వీటివల్ల ప్రయోజనంకంటే నష్టమే ఎక్కువ వాటిల్లుతుంది. వీటిని ఎలా వాడాలి మరియు ఎలా శుభ్రపరచుకోవాలి అన్న అంశం మీద పూర్తి అవగాహనా కలిగి ఉండటం మంచిది. నాన్-స్టిక్ పాత్రల తయారీలో టెఫ్లాన్ కోటింగ్ వేస్తారు, దీని కారణంచేత ఆహార పదార్ధాలు పాత్ర అడుగు భాగానికి అంటుకోకుండా తేలికగా తీసేందుకు అవకాశం ఉంటుంది. టెఫ్లాన్ అనేది సిన్తేథిక్ రసాయనం, కార్బన్ మరియు ఫ్లోరిన్ పరమాణువులతో దీనిని తయారుచేస్తారు. పాత్రను ఎక్కువుగా వేడి చేసినప్పుడు, ఈ ఫ్లోరిన్ పరమాణువులు మన ఆహారంలోకి చేరుతాయి, ఇటువంటి ఆహారాన్ని తరచూ తినడంచేత క్యాన్సర్ వ్యాధి భారిన పడే అవకాశం ఉంటుంది.

నాన్- స్టిక్ ఫ్యాన్ ని 107 డిగ్రీల కంటే ఎక్కువ వేడి చేస్తే ఆహారాన్ని కలుషితం చేస్తుంది, అలాగే ఖాళీగా ఉండే ప్యాన్ని ఎక్కువ వేడి చేసిన ప్రమాదమే. కనుక నాన్-స్టిక్ ప్యాన్లో వంట చేసేవారు తక్కవ లేదా మధ్యస్థమైన వేడిలో మాత్రమే వంటను సిద్ధం చెయ్యాలి. ఖాళీగా ఉండే ప్యాన్ని వేడి చెయ్యడం మానేయాలి. కుదిరితే మట్టి పాత్రలు, పింగాణీ పాత్రలు, మరియు స్టీల్ పాత్రల్లో వంట చెయ్యడానికి ప్రయత్నించాలి.


నాన్-స్టిక్ పాత్రలను శుభ్రం చేసేవారు, వాటిని గోకి శుభ్రం చెయ్యడం మానుకోవాలి, ఇలా చేస్తే ఆహారంలో టెఫ్లాన్ కోటింగ్ కలవకుండా ఉంటుంది. నాన్-స్టిక్ పాత్రలను శుభ్రంచేయ్యడానికి మెత్తని స్పాంజ్ లేదా చేతితో సున్నితంగా శుభ్రం చేసుకోవడం అలవాటుచేసుకోవాలి. అలాగే చాల కాలం నుండి వినియోగిస్తున్న పాత్రల్లో పూత చెడిపోతుంది అటువంటివాటిని వాడకపోవడం మంచిది.

Share your comments

Subscribe Magazine