సంపూరణ ఆహారం అంటే కార్బోహైడ్రాట్లు, ప్రోటీన్లు, ఇతర ఖనిజాలు లభ్యమయ్యే ఆహారం, పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణించవచ్చు. పాలలో అనేక పోషకాలకు మూలం. అయితే మనం తాగే పాలుకూడా స్వచ్ఛమైనవై ఉండాలి. స్వచ్చమైన పాలు అంటే ఏమిటనే సందేహం మీకు వచ్చి ఉండచ్చు, పాలల్లో ఏ విధమైన అడల్ట్రెంట్లు, హార్మోన్లు కలపకుండా ఉన్న పాలను స్వచ్ఛమైనవిగా ఫరిగణించవచ్చు.
పశువుల్లో పాల ఉట్పతి పెంచడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ పశువులకు ఇంజెక్ట్ చేస్తారు. ఇటువంటి పశువులనుండి వచ్చిన పాలును తాగడం వలన ఎన్నో దుష్ఫ్రభావాలు కలగవచ్చు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు, ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్సిటోసిన్ వినియోగిస్తున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది, అయినాసరే ఇంకా చాల మంది ఈ హార్మోన్ వినియోగాన్ని కొనసాగిస్తున్నారు. వినియోగదారుల ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ లేకుండా కేవలం అధిక లాభాలు పొందాలన్న ఆలోచనతో కొంతమంది వ్యవహరించడం బాధాకరం. ఈ హార్మోన్ల వినియోగం వలన పశువుల ఆరోగ్యం కూడా క్షిణిస్తుంది.
ఆక్సిటోసిన్ పాలను తాగడం మూలాన శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. మన రోజువారీ జీవనం సాగవుగా సాగాలంటే హార్మోన్లు నిర్దిష్ట సమయంలో విదుదల కావలి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడితే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఇటివంటి పాలను తరచూ తాగడం వలన కడుపుకు సంభందించిన వ్యాధులెన్నో మొదలవుతాయి, వీటిలో వాంతులు, మలంలో రక్తం రావడం, కడుపు నొప్పి రావడం వంటివి ప్రధానమైనవి. మరీముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువుగా ఉండేందుకు ఆస్కారం ఎక్కువ, కనుక చిన్నపిల్లలు ఉన్నవారు తమ పిల్లలకు ఇచ్చే పాలు మంచివో కావో సరిచూసుకోవాలి.
అంతేకాదు పాలు కల్తీవైతే అలెర్జీ సమస్యలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అల్లెర్జి ఉన్నవారిలో దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన సమస్యలు తలెత్తవచ్చు. ఆక్సిటోసిన్ కలిపిన పాలు తాగడం మంచిది కాదని వైద్యులు మరియు ఆహారానిపుణులు సూచిస్తున్నారు, ఇటువంటి పాలను తాగడం మూలాన క్యాన్సర్ వంటి వ్యాధులు రావడానికి కూడా ఆస్కారం ఉంది.
Share your comments