ప్రస్తుతం చాలా మంది డైటింగ్ అన్న పేరుతో రాత్రిపూట పూర్తిగా తిండి మానేస్తున్నారు. ఇలా చెయ్యడం ద్వారా బరువు తగ్గుతాం అని అందరూ అనుకుంటారు. అయితే అది నిజం కాదు. రాత్రి పూట తిండి తినడం మానేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు తలేతెందుకు అవకాశం ఉంటుంది. ఆ సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పుట తినకపోతే పోషకాల లోపం తలెత్తుతుంది. పడుకునే సమయంలో మెదడు విశ్రాంతిలో ఉన్నా శరీరంలో జీవనక్రియలు జరుగుతూనే ఉంటాయి. ఈ సమయంలో శరీరం తననితాను రిపేర్ చేసుకుంటుంది. ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు మరియు శక్తీ లభిస్తుంది. రాత్రి పూట తినకుంటే నీరసం, అలసట మరియు బలహీనత వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఎదిగే వయసున్న చిన్నపిల్లలు రాత్రిపూట ఆహారం తినకుండా ఉండకూడదు, లేకుంటే ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది.
రాత్రిపూట ఆహారం మానేస్తే జీర్ణసమస్యలు కూడా తలేతెందుకు అవకాశం ఉంటుంది. దీనిమూలంగా అజీర్తి, గ్యాస్ మరియు మలబద్దకం వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాత్రిపూట అన్నం తినడం మానేస్తే ఉన్నటుండి బరువు తగ్గిపోతారు. దీనివలన ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. కాలికడుపుతో పడుకోవడం ద్వారా నిద్రలేమికి దారితీస్తుంది, దీని వలన మానశిక ప్రశాంతత కోల్పోతారు. రాత్రి తినడం మానేస్తే శరీరానికి అందవలసిన పోషకాలు అందక నీరసంతో పాటు రక్తహీనత ఏర్పడి శరీరం బలహీనపడిపోతుంది.
కొన్ని అధ్యయనాల్లో తేలింది ఏమిటంటే రాత్రిపూట తినడం మానేస్తే గుండె జబ్బలు పెరిగే ప్రమాదం ఉంటుంది. రాత్రిపూట తినకపోవడం చర్మ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది, చర్మం ముడతలు పడిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. దీనితోపాటుగా రాత్రి తినకపోవడం రక్తంలో చెక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. ఇటువంటి ఎన్నో సమస్యలు రావడం మూలాన చివరిగా మానసిక ప్రశాంతత కూడా దెబ్బతింటుంది.
కాబట్టి రాత్రిపూట కాలికడుపుతో ఉండకూడదని గుర్తించుకోండి. అలాగని రాత్రి భారీగా ఆహారం తీసుకున్న ప్రమాదమే. రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహరం తినడానికి ప్రయత్నించాలి. పెరుగు, పాలు, పళ్ళు, గుడ్లు వంటివి తినవచ్చు. తిన్నవెంటనే పడుకోకూడదు కాబట్టి తినడానికి మరియు పడుకోవడానికి మధ్య కనీసం రెండు గంటలైనా సమయం ఉండేలా చూడాలి.
Share your comments