అసలే వేసవి కాలం బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు తక్కువ లేదు. ఇటువంటి సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి, పోనీ ఇంట్లోనే ఉండమంటే, ఉక్కపోతతో సతమతమవ్వాల్సిందే. ఇటువంటి సమయంలో ఏసీ ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఏసీ ఉండటం వలన మండేఎండల్లోనూ చల్లని హాయి అనుభూతిని పొందవచ్చు. అయితే చాల మంది ఏసీ ఉందని నిరంతరం ఏసీ గదిలోనే గడుపుతారు. ఇది చాల ప్రమాదకరం. అధిక సమయం ఏసీ కింద వ్యచ్చిస్తే ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
ఏసీ ఆన్ చేసిన తర్వాత గదిలోని ఉష్ణోగ్రత క్రమంగా తగ్గతూ నిర్దిష్ట ఉష్ణోగతకు చేరుకుంటుంది, అదే సమయంలో తేమ శాతం కూడా తగ్గుతుంది. తేమ తక్కువుగా ఉండే గదిలో ఎక్కువసేపు ఉన్నట్లైతే శరీరం పొడిబారి పెళుసుగా మారుతుంది. దీనివల్ల దురద మరియు మంటారావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఎక్కువ సమయం ఏసీ కింద ఉంది ఒకేసారి ఎండలోకి వెళితే శరీరమంతా మంటగా మరియు కళ్ళు ఎర్రబడటం, మంట రావడం వంటివి జరగవచ్చు. చాల మంది ఎండ వేడి నుండి తప్పించుకోవాలని ఏసీ ని తక్కువ ఉష్ణోగ్రతలో రన్ చేస్తారు, ఇలా ఉష్ణోగ్రత తక్కువగా ఉండే గదిలో ఎక్కువసేపు ఉన్నట్లైతే కండరాలు పట్టేయడం కీళ్ల నొప్పులు రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు, మరీముఖ్యంగా పెద్దవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
సాధారణంగా ఏసీ ఉన్నగదిలో వెంటిలేటర్లు మరియు కిటికీలు ఎల్లపుడు మూసి ఉంచడంచేత గదిలోని దుమ్ముధూళి బయటకు వెళ్లేందుకు మార్గముండదు, ఇటువంటి గాలినే పిలుస్తూ ఉండటం చేత ఊపిరితిత్తుల సమస్యలు కలగవచ్చు. అలాగే ఏసీ లోని ఫిల్టర్ని తరచు శుభ్రంచేస్తూ ఉండలి లేకుంటే ఫిల్టర్ పై బాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
చాలామందికి ఏసీ పడదు అటువంటివారు, ఎక్కువ సమయం ఏసీలో ఉంటె తలనొప్పి రావడం, వికారంగా అనిపించడం, మరియు చల్లదనం కారణంగా రక్తనాళాలు మొదలైన లక్షణాలు గమనించవచ్చు, అటువంటి వారి వీలైనంత తక్కువ ఏసీ గదిలో ఉండటం మంచిది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎల్లపుడు ఏసీ గదిలోనే కాకుండా, అప్పుడప్పుడు కాస్త బయటగాలిని కూడా పిలుస్తూ ఉండాలి. పగటిపూట ఎండలు ఎక్కువుగా ఉంటాయి కాబట్టి సాయంత్రం వేళల్లోనైనా బయట గాలిని పీల్చాలి.
Share your comments