శరీరం సమర్ధవంతంగా పనిచెయ్యడానికి విటమిన్లు ఎంతో కీలకం. ఇవి మొత్తం 13 వాటిలో విటమిన్ బికి చెందినవి ఎనిమిది విటమిన్లు, వీటిని బి కాంప్లెక్స్ విటమిన్స్ అనికూడా పిలుస్తారు. వీటిలో విటమిన్ బి మన శరీరానికి ఎంతో ముఖ్యమైనది. విటమిన్ బి12 ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయి వాటిలో, డిఎన్ఏ సంశ్లేషణ, కేంద్ర నాడి వ్యవస్థను పెంపొందించడం, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తిచేయ్యడం, జుట్టు ఎదుగుదలకు సహాయం అందించడం ముఖ్యమైనవి. విటమిన్ బి12 ఆహారం ద్వారా మనకు లభిస్తుంది. అయితే వయసు పెరిగేకొద్దీ విటమిన్ బి12 గ్రహించే సామర్ధ్యం తగ్గుతూ వస్తుంది, దీనివలన పెద్దవయసు ఉన్నవారికి విటమిన్ బి12 సుప్ప్లీమెంట్స్ ఇస్తారు. అయితే వీటిని తరచు వాడటం వలన ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ బి 12 లోపం వలన జ్ఞాపకశక్తి కోల్పోవడం, డిప్రెషన్, ప్రవర్తనలో మార్పులు, మరియు ఇతర మానసిక సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఈ విటమిన్ లోపాన్ని గుర్తిచడం ఎలా అన్న సందేహం కలిగినట్లైతే, బి 12 విటమిన్ లోపం ఉన్నవారిలో కళ్ళు తిమ్మిర్లు, కండరాల బలహీనత, అలాగే నడవడంతో ఇబ్బంది కలగవచ్చు.
తరచూ విటమిన్ బి12 సుప్ప్లీమెంట్స్ తీసుకునేవారిలో ఎన్నో దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంది. వీటిని ఎక్కువుగా వాడటం వలన శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తం గడ్డకట్టి, ఆ భాగాల్లో వాపు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా వాంతులు విరోచనాలు కూడా వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన తలనొప్పితో, గుండె కొట్టుకోవడం మరియు శ్వాసతీసుకోవడంలో మార్పులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. దీర్ఘకాలికంగా నరాల సమస్యలు కూడా తలెత్తవచ్చు.
దీనివలన విటమిన్ బి12 లోపం ఉన్నవారు, టాబ్లెట్ల మీద ఆధారపడకుండా, సహజసిద్ధమైన ఆహార పద్దార్దల మీద ఆధారపడటం ఉత్తమం. పాలు, పెరుగు, జున్ను, సొయా, పచ్చికూరగాయల్లో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా విటమిన్ బి12 లోపాన్ని తరిమికొట్టవచ్చు.
Share your comments