చాలామందిని ఈ గురకసమస్య బాధపెడుతోంది. గురక ఉన్నవారికి మాత్రమే కాకుండా పక్కవారి నిద్రని కూడా భంగం కలిగిస్తుంది. చాలా మంది గురకును తేలికగా తీసుకుంటారు, ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. గురకు ఉన్నవారు కొన్ని సులువైన పద్దతులు పాటించడం ద్వారా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక బరువు గురకకు ఒక ప్రధాన కారణం కావచ్చు. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు లేదంటే స్థూలకాయం ఉన్నవారిలో ఈ గురక ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ముందుగా ఆహార నియమాలను మార్చుకొని హ్=బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. గురక సమస్య ఉన్నవారికి అల్లం చక్కగా పనిచేసి ఈ సమస్యను దూరం చేస్తుంది. ఉదయాన్నే లేదంటే రాత్రి పడుకునే ముందు ఒక చెంచా అల్లం రసం తీసుకుంటే గురక సమస్య క్రమంగా దూరమవుతుంది. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఎన్నో వ్యాధుల నుండి మనకు రక్షణ కూడా కల్పిస్తాయి. కాబట్టి అల్లాన్ని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి.
అల్లంతో పాటు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి కూడా గురక తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి ఆహారంలో ప్రతిరోజు ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లిని రసం లాగా చేసుకొని తీసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి. పళ్లలో మెలటోనిన్ ఉన్న పళ్ళను ఎక్కువుగా తీసుకుంటే గురక సమస్య దూరమవుతుంది. ఇందుకోసం పైన్ఆపిల్, అరటిపండు, ఆరంజ్ వంటి ఫలాలను తినడం చేత గురక దూరమవుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఒక అరస్పూన్ తేనే మరియు ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తీసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.
గురక మరియు నిద్రలేమి ఉన్నవారికి పుదీనా ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకొని తాగితే గురక దూరమవ్వడంతో పాటు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. దీనితోపాటు రాత్రి పడుకునేముందు గోరువెచ్చని నీటిలో యాలుకల పొడి కలుపుకొని తాగితే క్రమంగా గురక సమస్య తగ్గుతుంది. నిద్రపోయేముందు ఒక చెంచ తేనెలో దాల్చినచెక్క కలుపుకొని తినడం ద్వారా ఎక్కువుగా గురక వచ్చేవారికి తొందరగా నయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అన్ని ఉపాయాలు పాటించినా గురక తగ్గకపోతే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
Share your comments