పాదాలు పగుళ్లు ఎంతోమందిని వేదించే సమస్యల్లో ఒకటి. పురుషులలో కంటే స్త్రీలలో పాదాల పగుళ్లు ఎక్కువుగా కనబడతాయి. పాదాల అడుగు భాగంలో పగుళ్లు ఏర్పడటం చేత నొప్పి మరియు మంట వస్తూ ఉంటుంది. పగుళ్లు మరి ఎక్కువుగా ఉంటె కొన్ని రక్తం వచ్చి ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ పగుళ్ల సమస్య ఎక్కువవుతుంది. చాలా మంది ఈ పగుళ్ళకు చికిత్స చేయించకుండా అలాగే వదిలేస్తారు.
పాదాల అడుగుభాగం చాలా మందంగా ఉంటుంది, అంతేకాకుండా పాదాలు శరిరంలో కింద ఉండటం చేత వీటికి సరిపడినంత రక్త ప్రసరణ మరియు కణాల అభివృద్ధికి అవసరమైన ఆక్సిజన్ లభించదు. పాదాలకు రక్తం అందకపోయినా, అక్కడి చర్మంనికి కావాల్సిన నీరు మరియు పోషకాలు అందకపోయినా ఎండిపోయి పగుళ్లు ఏర్పడతాయి. పాదాల చర్మం మందంగా ఉంది కండరం పొరతో విస్తరించి ఉంటుంది కాబట్టి మొదట పై పోరా ఎండిపోయి, పగుళ్లు ఏర్పడి చర్మం లోపలి వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే ఈ పగుళ్ళను కొన్ని వంటింటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. అది ఎలాగో తెల్సుకుందాం.
పాదాలకు అవసరమైన రక్తం అందకపోవడం, పాదాలు పగుళ్ళకు ప్రధాన కారణం. కాబట్టి పాదాలకు ప్రతీ రోజు మర్దనా చెయ్యాలి, ఇలా చెయ్యడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరగడంతో పాటు, చర్మానికి అవసరమైన పోషకాలు మరియు నీరు లభిస్తుంది. ప్రతి రోజు కనీసం ఒక 20 నిమిషాలు ఇలా మర్దన చెయ్యాలి. నిద్రపోయే ముందు కొబ్బరి నూనెను పాదాలకు పట్టించడం ద్వారా పాదాలకు అవసరమైనంత తేమ లభిస్తుంది.
పాదాలకు అవసరమైనంత తేమ అందించడానికి ఒక బకెట్లో చల్లటి నీటిని నింపి ప్రతి రోజు పాదాలను దానిలో ఒక పది నిమిషాలు ఉంచాలి. ఇలా చెయ్యడం ద్వారా పాదాలలో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలిగిపోతాయి. పైన్ ఆపిల్ పండును మిక్సీలో వేసి ఆ గుజ్జును పాదాలకు పట్టిస్తే పగుళ్ల వద్ద ఉన్న డెడ్ స్కిన్ తొలిగిపోయి కొత్త కణాలు వస్తాయి దీని వలన పగుళ్లు కూడా తొందరగా తగ్గిపోతాయి.
Share your comments