Health & Lifestyle

నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా... ఇలా దూరం చేసుకోండి?

KJ Staff
KJ Staff

మీరు నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా. అయితే ఇది చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో
చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం వంటి అనేక రకాల వ్యాధులకు కారణం కావచ్చు.నోటి దుర్వాసన సమస్యను వైద్య పరిభాషలో హాలిటోసిస్‌ అంటారు. ఈ సమస్య ప్రధానంగా నోటి శుభ్రత పాటించకపోవడం, జీర్ణ సంబంధిత వ్యాధులు కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మొదట మన జీర్ణ వ్యవస్థను మెరుగు పరుచుకోవడానికి సరైన ఆహార పద్ధతులు పాటించాలి.అలాగే నోటిని ఒక క్రమపద్ధతిలో రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి.

నోటి దుర్వాసన తొలగించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించి అద్భుత ఫలితాలను పొందవచ్చు.నోటి దుర్వాసనను నివారించాలంటే విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు,ఆపిల్స్, క్యారట్స్‌, ఉసిరితో కూడిన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలి. రోజూ తాజా పెరుగు తీసుకోవడం ద్వారా నోటి దుర్వాసనకు కారణమైన హైడ్రోజెన్‌ సల్ఫేడ్‌ పాళ్లను తగ్గించి తద్వారా నోటి దుర్వాసన చెక్ పెట్టవచ్చు.

నోటి దుర్వాసనతో బాధపడేవారు లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన తొలగిపోతుంది.జామ ఆకుల లేదా లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గి తద్వారా దుర్వాసన కూడా తొలగిపోతుంది. ప్రతిరోజు ఆహారం తరవాత కొత్తిమీర, పుదీన,యూకలిప్టస్, రోజ్‌మేరీ వంటి వాటిని తినడం ద్వారా నోటి దుర్వాసనను దూరంగా ఉండవచ్చు. నోటి దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలను తీసుకోవడం ఉత్తమం.

Share your comments

Subscribe Magazine