సాధారణంగా మనం ఏదైనా వంట చేయాలన్నా తప్పనిసరిగా అందులో కొత్తిమీర ఉపయోగిస్తాము. వంటలలో కొత్తిమీర ఉపయోగించడం వల్ల వంటలకు సువాసన రావడమే కాకుండా వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వంటకు సువాసన, రుచితో పాటు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కోతిమీర అందిస్తుంది.ముఖ్యంగా ఎన్నో రకాల చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కొత్తిమీర ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కొత్తిమీర వల్ల కలిగే చర్మ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
చర్మకాంతిని పెంచడానికి కొత్తిమీర ఆకులు ఎంతగానో దోహద పడతాయి. కొత్తిమీర ఆకులను మెత్తని మిశ్రమంలా తయారు చేసి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, మరొక టేబుల్ స్పూన్ తేనే, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొహం మొత్తం ప్యాక్ మాదిరిగా వేసుకుని ఓ అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మొహం పై ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
అదేవిధంగా కొత్తిమీర ఆకులను శుభ్రం చేసి అందులోకి, కొద్దిగా అన్నం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అంటించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం ఎంతో మృదువుగా మారడమే కాకుండా చర్మం పై ఏర్పడిన మొటిమలు మచ్చలు తొలగిపోతాయి.
చర్మం పై ముడతలతో బాధపడేవారు కొత్తిమీర ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి అందులోకి కలబంద జెల్ మొహానికి అంటించడం వల్ల ముఖం పై ఉన్న ముడతలు తొలగిపోయి ఎంతో యవ్వనంగా కనిపిస్తారు. కొత్తిమీర కాడలు ఆకులలో పీచు పదార్థాలు అధికంగా ఉండటమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి.కొత్తిమీరను తరచూ ఆహార పదార్థాలలో భాగంగా తీసుకోవడం వల్ల ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా శరీర బరువు తగ్గడానికి దోహదపడతాయి.
కొత్తిమీరలో విటమిన్ ఎ పుష్కలంగా లభించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసి కంటి చూపును మెరుగుపరుస్తుంది.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి కోతిమీరను తరచూ ఆహార పదార్థాల లో భాగంగా తీసుకోవటంవల్ల ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.
Share your comments