Health & Lifestyle

MonkeyPox: ప్రజల్ని వణికిస్తున్న మంకీఫోక్స్ , వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

KJ Staff
KJ Staff

2019 లో వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒక ఊపుఊపేసింది. ఇప్పుడు అదే తరహాలో మంకీపోక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో గుర్తించగా ఇప్పటికే 13 దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి ఎక్కువుగా చిన్నపిల్లకు మరియు యువతకు సోకడంతో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్, తాజాగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.

ఈ వ్యాధి ఆఫ్రికా దేశాల్లో విజృంభిస్తుంది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 10వేల మంకీపోక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు దాదాపు 500 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గతఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కేసులు దాదాపు రెట్టింపయినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ చెబుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధి 13 ఆఫ్రికన్ దేశాల్లో ఆక్టివ్ గా ఉంది, అలాగే 160% కాగా, మరణాలు రేటు 19% ఉంది. ఇది ఆందోళన చెందవలసిన విషయమని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంది.

గతంతో పోలిస్తే మంకీపాక్స్ కొత్త వేరియెంట్‌లో ఇప్పుడు కనిపిస్తోంది. శరీరంలోకి సోకిన తర్వాత ఆరంభంలోనే ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించడం వైద్యులకి కూడా కష్టం అవుతోంది. దాంతో వ్యాధి సోకిన వారు తమకి తెలియకుండానే ఇతరులకు ఈ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తున్నారు. కొత్త వేరియంట్‌ బాధితులకి ఎక్కువగా ఛాతీ, చేతులు, కాళ్లకి గాయాలు కనిపిస్తాయి.

వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది:
మంకీపోక్స్  వేగంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరకి వెళ్లి మాట్లాడటం, లేదా తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా వ్యాధి సోకిన వ్యక్తి ఉపయోగించిన వస్తులు, బట్టలు వినియోగించడం ద్వారా కూడా వ్యాధి సోకె ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంకీపోక్స్ సోకిన వ్యక్తిలో 21 రోజులలోపు శరీరంలో మార్పులు కనిపించడం మొదలవుతుంది. ముందుగా గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు మరియు వెన్నునొప్పి తదితర సమస్యలు తలెత్తుతాయి, దీనితో మనిషి క్రమంగా నీరసించిపోతాడు. అంతేకాకుండా చర్మం మీద దద్దుర్లు కూడా ఏర్పడతాయి, వీటితో దురదా ఎక్కువుగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. 

వ్యాధి తీవ్రత ఎక్కువయ్యేకొద్దీ, న్యుమోనియా, చూపు మందగించడం, వాంతులు, అతిసారం, శరీరంలో వాపు మరియు నొప్పి ఎక్కువుగా ఉంటాయి. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. భారత్‌లో 2022లో మొట్ట మొదటిసారి మంకీపాక్స్‌ని గుర్తించారు. ఆ తర్వాత గత ఏడాది జూలైలో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 27 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ, ఢిల్లీ నుంచే అత్యధికం. ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కి వచ్చే ప్రయాణికుల ద్వారా మంకీపాక్స్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది.

చికిత్సకంటే నివారణ మేలన్నది ఎంతో నిజం. మంకీపోక్స్ రాకూండా ముందస్తు చర్యలు పాటించడం చాలా శ్రేయస్కరం. ఈ వ్యాధి భారిన పడకుండా ఉండేందుకు చేతులను ఎల్లప్పుడూ సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొక్కరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది, కాబట్టి విదేశీ ప్రయాణాలు చేసొచ్చిన వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండాలి. దద్దుర్లు, జ్వరం, మరియు ఇతర మాకీపోక్స్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించిన తగిన చికిత్స అందుకోవాలి.

Share your comments

Subscribe Magazine