మన దైనందన జీవితం సజావుగా సాగాలన్న మరియు ఆరోగ్యంగా ఉండాలన్న ఎన్నో రకాల పోషకాలు అవసరం. ఈ పోషకాలు మనం తీసుకునే ఆహారం నుండి లభిస్తాయి. ఈ పోషకాల్లో ఫైబర్ ఎంతో ముఖ్యమైనది. ఫైబర్ అన్ని రకాల కూరగాయలు మరియు పళ్లలో పుష్కలంగా ఉంటుంది. మన తీసుకున్న ఆహారం క్రమపద్ధతిలో జీర్ణం కావాలన్నా, వాటిలోని పోషకాలు శరీరానికి అందాలన్న ఫైబర్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఫైబర్ చాల అవసరం. వీటితోపాటు గుండె జబ్బులు రాకుండా నివారించడంలో ఫైబర్ ముఖ్యమైన భూమిక పోషిస్తుంది. అయితే మారుతున్న ఆహారపు అలవాట్ల మూలంగా చాలా మందిలో ఫైబర్ యొక్క లోపం కనిపిస్తుంది. అయితే ఫైబర్ లోపిస్తే ఎంత ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందన్న విష్యం మనందరికి తెలిసిందే. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటే ఆహారం సవ్యంగా జీర్ణం కావడంలో తోడ్పడుతుంది. దీనితోపాటు ఫైబర్ ప్రేగులలోని మంచి బాక్టీరియా వృద్ధి చెందేందుకు సహాయపడుతుంది.
అయితే మనం తీసుకునే ఆహారంలో సరైన మొత్తంలో ఫైబర్ లేకుంటే ఫైబర్ లోపం తలెత్తుతుంది. శరీరానికి అవసరమైనంత ఫైబర్ తీసుకోకాపోతే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది, దీనివలన పొట్ట శుభ్రంకాదు, శరీంలో చెడు పదార్ధాలు పేరుకుపోతాయి. దీనిమూలన మొటిమలు మరియు నోటి పూత సంబంధిత వ్యాధులు తలెత్తవచ్చు. అంతేకాకుండా ఫైబర్ లోపం, గ్యాస్, మలబద్దకం, అజీర్ణం, అసిడిటీ వంటి అనేక ఉదరసంబంధిత వ్యాధులకు దారితియ్యవచ్చు. వీటితోపాటు గుండె సంబంధిత వ్యాధులు, పేగు క్యాన్సర్, పైల్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది.
Share your comments