ప్రస్తుత కాలంలో మనిషి జీవన విధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే వారి ఆహార విషయంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేటి కాలంలో ప్రజలు పోషకాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి మొత్తం ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లపై ఆధారపడి ఉన్నారు. ఈ క్రమంలోనే మన శరీరానికి అవసరమైన పోషక విలువలు అందక ఎముకల ఎంతో పెలుసుగా మరి ఏ చిన్న ప్రమాదం వాటిల్లిన విరిగిపోవడం జరుగుతుంది. మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండాలంటే తప్పనిసరిగా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం.
సాధారణంగా మన శరీరానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఈ క్రమంలోనే సాల్మన్ చేపలు, ట్యూనా చేపలు, ట్రౌట్ వంటి క్యాల్షియం అధికంగా లభించే చేపలను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. ఈ చేపలను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన స్థాయిలో కాల్షియం అందుతుంది. క్యాల్షియం అధికంగా ఉన్నప్పుడు మన శరీరంలో ఎముకల గట్టిదనం ఏర్పడుతుంది.అదేవిధంగా పాలు పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి కాల్షియం మన శరీరానికి సరైన మోతాదులో అందుతుంది.
తాజా ఆకు కూరలు కూరగాయలను తినడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్లు, ప్రొటీన్లు, ఇతర పోషక పదార్థాలు మన శరీరానికి అందే శరీరంలో ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా ఇతర శరీర ప్రక్రియలను వేగవంతం చేస్తాయి. ఇకపోతే ప్రోటీన్లకు అత్యంత నిలయం గుడ్ల అని చెప్పవచ్చు. గుడ్లలో ప్రొటీన్లు అధికంగా లభించడమే కాకుండా క్యాల్షియం, విటమిన్ డి విరివిగా లభిస్తుంది.ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు ఏ సీజన్లో లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు పూర్తిస్థాయిలో అందుతాయి. ఈ విధంగా పోషకాలు అందినప్పుడే మన శరీరంలో ఎముకలు ఎంతో భద్రంగా దృఢంగా మారుతాయి.
Share your comments