సాధారణంగా మనం అరటిపండు తినేటప్పుడు తొక్కను పడేయడం సర్వసాధారణమే. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే అరటిపండులో కన్నా తొక్కలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అయితే మనం తినకుండా పడేసే ఈ అరటి తొక్కలో దాగిఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటో.. ఇక్కడ తెలుసుకుందాం...
చాలామంది పళ్ళు పై పసుపు గారా ఏర్పడి ఉంటుంది. ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు నలుగురిలో స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడాలన్నా వెనకడుగు వేస్తారు.ఇలాంటి వారు అరటిపండు తొక్కతో ప్రతి రోజు అరగంట పాటు పళ్లపై రుద్దడం వల్ల పళ్ల మీద ఏర్పడిన పసుపుపచ్చ మరకలు తొలగిపోతాయి. అదేవిధంగా మొహం పై మచ్చలు మొటిమలు సమస్యతో బాధపడే వారు అరటిపండు తొక్కలను గుజ్జుగా చేసి వాటితో మొహంపై మొటిమలు మచ్చలు తొలగిపోయి ముఖం ఎంతో అందంగా కనబడుతుంది.
సాధారణంగా మన శరీరంలో వివిధ రకాల నొప్పులతో మనం బాధపడుతుంటాము. ఈ విధమైన నొప్పులతో బాధపడే వారు ఒక అరగంట పాటు నొప్పి ఉన్న భాగంపై ఉంచితే నొప్పి నుంచి తొందరగా విముక్తి పొందవచ్చు. అదేవిధంగా చాలా మందికి దోమలు కుడితే శరీరంపై ఎంతో దురదగా ఉండే ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. ఈ దద్దుర్లు పై అరటి తొక్కను ఉంచడం వల్ల తొందరగా దురద నుంచి విముక్తి పొందవచ్చు. ఈ అరటి తొక్క లను ఉపయోగించి షూ పాలిషింగ్, వెండి గిన్నెలు శుభ్రం చేస్తే ఎంతో మెరిసిపోతాయి.చూశారు కదా.. తొక్కేకదా అని పడేస్తే ఇన్ని ప్రయోజనాలను కోల్పోవలసి వస్తుంది.
Share your comments