సాధారణంగా మనం కొద్దిపాటి ఉప్పు కారం అధికంగా కలిగిన ఆహార పదార్థాలను తిన్నప్పుడు కడుపులో ఉబ్బరం, అజీర్తి మంట అనిపిస్తుంది. ఈ విధమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు మన జీర్ణవ్యవస్థ కూడా జీర్ణక్రియను నెమ్మదిగా చేసి సమస్యలను తలెత్తేలా చేస్తుంది.మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మనం కొద్దిగా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే మసాలాదినుసులు నూనె తక్కువగా ఉపయోగించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా పని చేస్తుంది.మరి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా ఇష్టపడే తీసుకునే ఆహార పదార్థాలలో పెరుగన్నం ఒకటి. ఈ పెరుగన్నాన్ని చాలామంది వివిధ రకాలుగా తయారు చేసుకొని తింటారు.పెరుగు అన్నం తినడం వల్ల పెరుగులో ఉన్నటువంటి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపి జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా పెరుగన్నం తేలికగా ఉండటం చేత తొందరగా జీర్ణం అవుతుంది.
మీ కడుపులో అజీర్తి వంటి సమస్యలతో బాధపడే టప్పుడు లేదా నీళ్ల విరోచనాలు అవుతున్న సమయంలో కిచిడిను తీసుకోవడం ఎంతో ఉత్తమం.బియ్యం పెసరపప్పును బాగా మెత్తగా ఉడకబెట్టి కిచిడీ తయారు చేసుకొని తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగా లేని వారు ఇడ్లీలను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఇడ్లీలను తినటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పని చేయడమే కాకుండా తేలికగా జీర్ణమవుతుంది. అందుకే ఈ విధమైనటువంటి ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments