ఈ బిజీ ప్రపంచంలో పని ఒత్తిడితో ఎప్పుడు ఎలా తింటున్నామో మనకే తెలీదు. ఒకప్పుడు చక్కగా కింద కూర్చొని అరిటాకులో వడ్డించుకొని ప్రశాంతంగా భోజనం తినే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడేమో డైనింగ్ టేబుళ్ల మీద కూర్చొని తినడం లేదంటే ఎక్కడపడితే అక్కడ కూర్చొని తినడం సాధారణమైపోయింది.
ఇది వరకు నేల మీద కూర్చొని తినే రోజుల్లోనే మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ అలవాటు పోయిందనే చెప్పవచ్చు. కాళ్లు మడిచి నేలమీద కూర్చొని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇలా కూర్చొని తినడం ద్వారా జీర్ణక్రియ క్రియ మెరుగుపడటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నేలమీద కూర్చొని తినడం ఒక ఆసనం వేసిన దానితో సమానం. ఈ భంగిమలో ఉదార కండరాలని సడలిస్తుంది.
ఇలా కాళ్ళు మడిచి కింద కూర్చొని తినడాన్ని సుఖాసనం అని పిలుస్తారు. ఈ ఆసనంలో కూర్చొని తినడం వలన జీర్ణసమస్యలన్ని తొలగిపోతాయని చెబుతారు. దీనితోపాటు మనం తీసుకునే ఆహారం సవ్యంగా జీర్ణం కావడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. కింద కూర్చొని తినడం ద్వారా మానశిక ప్రశాంతత మరియు పని భారం రెండు తగ్గిపోతాయి. సుఖాసనంలో కూర్చొని తినడం నరాలకు కూడా చాలా మంచిది. ఇది పారాసింపథెటిక్ నాడి వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇలా కింద కూర్చిని తినడం ద్వారా ఆహారంలోని పోషకాలన్నీ మన శరీరానికి లభిస్తాయి.
నేల మీద కూర్చొని తినడం వలన మనసుకు సంతృప్తిగా ఉంటుంది. కాళ్ళు ముడుచుకొని కూర్చిని తినడం ద్వారా పొట్టమీద భారం పడి ఎక్కువ తినకుండా, అవసరమైనంత వరకు మాత్రమే తింటాము. ఇలా తిన్నపుడు కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలిగి మానశిక మరియు శారీరిక ఆరోగ్యం పెరుగుతోంది.
Share your comments