మన వంటింట్లో ఉపయోగించే వాటిలో మెంతులు ఒకటి. మెంతులు చూడటానికి చిన్నగా, చేదు రుచిని కలిగి ఉన్నప్పటికీ ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి మెంతులను తరచూ ఏదో రూపంలో తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా మెంతి నీరు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. మరి ఇ మెంతి నీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
మెంతులలో ఎన్నో పోషక విలువలతో పాటు విటమిన్లు, ఫైబర్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే మెంతులను దోరగా వేయించి వాటిని పొడిచేసి ఆ పొడిని ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగటం వల్ల మధుమేహం సంబంధిత వ్యాధులను నియంత్రణలో ఉంచవచ్చు .ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు మరియు జుట్టు రాలిపోవడం వంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారు మెంతులను ఉపయోగించటం వల్ల వారి సమస్యలను నియంత్రణలో ఉంచవచ్చు. ముదురు పసుపు రంగు ఉన్న గింజలలో ఎన్నో ఖనిజాలు మరియు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.మెంతులు ప్రతిరోజు వాడటం వల్ల అధిక బరువుతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మెంతిపొడిని ప్రతిరోజు పెరుగుతో కలిపి తీసుకోవటంవల్ల బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చు
మెంతులను రాత్రివేళ నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగటం వల్ల ఎన్నో జీర్ణక్రియ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు. మరియు డయాబెటిక్ ఉన్నవారికి ఈ నీటిని త్రాగటం వల్ల మధుమేహాన్ని అదుపులో పంచుకోవచ్చు.మెంతులు ప్రతిరోజు వాడటం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు. అలాగే మెంతుల వల్ల ఊపిరితిత్తులలోని సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మెంతి నీరు తాగడానికి కొద్దిగా చేదు ఉన్నప్పటికీ ఈ ప్రయోజనాలు అన్నింటిని మనం పొందవచ్చు.
Share your comments