సాధారణంగా అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మన ఆహారం జీర్ణం అవ్వడానికి అరటిపండు దోహదపడుతుందని భావించి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అరటిపండును తినడానికి ఇష్టపడతారు. అదేవిధంగా మన రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పెరుగు దోహదపడుతుంది.మరి ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నటువంటి పెరుగు అరటిపండు ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ తెలుసుకుందాం...
అరటి పండులో ఎక్కువ భాగం ఫైబర్ దాగి ఉంటుంది. అదేవిధంగా పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. ఈ రెండు కలిసినప్పుడు మన శరీరానికి కావల్సినంత క్యాల్షియంను అందించడానికి సహాయపడతాయి కనుక ప్రతి రోజు మన అల్పాహారంలో భాగంగా అరటిపండును, పెరుగును కలిపి తినడం వల్ల ఎముకలు ఎంతో దృఢంగా తయారవుతాయి.పెరుగు అరటిపండును కలిపి తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇవి దోహదం చేస్తాయి కనుక ప్రతి రోజు పెరుగు అరటిపండు కలిపి తింటే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
పెరుగులో ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా ఉండటం చేత మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. ఈ క్రమంలోనే వ్యాధికారక బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అవ్వగానే వాటి పై దాడి చేయడానికి ప్రో బయాటిక్ బ్యాక్టీరియా ఉపయోగపడుతుంది.అదేవిధంగా మలబద్ధకం సమస్యను తగ్గించడానికి కూడా పెరుగు అరటిపండు కలిపిన బ్యాక్టీరియా ఎంతగానో దోహదం చేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంతోపాటు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది కనుక పెరుగు అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Share your comments