సాధారణంగా కొన్ని ఆహార పదార్థాలను ఏ ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకపోవడం ఎంతో మంచిది.ఈ విధమైనటువంటి ఆహార పదార్ధాలు ఇతర ఆహార పదార్థాలతో ఇమడక పోవటం వల్ల మనం ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ క్రమంలోనే కడుపుబ్బరం, వాంతులు, అలసట, విరోచనాలు కొన్నిసార్లు మరణం వంటి ప్రమాదాలకు కారణం అవుతుంది.ఈ క్రమంలోనే మనం రోజువారీ జీవితంలో ఎంతో విరివిగా ఉపయోగించే ఆహార పదార్థాలలో ఒకటైన పాలతో ఏ ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం...
పాలు తాగే అలవాటు ఉన్నవారు ఎప్పుడూ కూడా పాలను గుడ్లు, చేపలు, మాంసం వంటి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. ఈ విధంగా మాంసాహారాలను పాలతో పాటు కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా పాలతో పాటు సిట్రస్ జాతికి చెందిన ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు.
ఈ విధంగా విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలతో పాటు పాలను కలిపి తీసుకున్నప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి ఆలస్యం అవ్వడమే కాకుండా ఛాతీలో నొప్పిని కలిగిస్తుంది. సాధారణంగా పాలు అరటి పండ్లతో మనం మిల్క్ షేక్ తయారుచేసుకుని తింటాము. అయితే ఈ విధంగా మిల్క్ షేక్ తాగినప్పుడు మనకు ఎంతో అలసటగా ఉంటుంది. ఈ క్రమంలోనే దీనిలోకి దాల్చిన చెక్క పొడి జోడించి తాగటం వల్ల ఎలాంటి అజీర్తి సమస్యలు, అలసట ఉండదు.
చాలామంది పాలను పెరుగును కలిపి తింటూ ఉంటారు. పొరపాటున కూడా ఇలా తినకూడదు. ఈ విధంగా పులియబెట్టిన ఆహారపదార్థాలను పాలతో పాటు కలిపి తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, వికారం, అనేక రకాల అంటు వ్యాధులకు కారణమవుతుంది. అలాగే పాలను ముల్లంగితో పాటు తీసుకోవడం వల్ల మన శరీరంలో అధిక వేడి కారణమౌతుంది. దీంతో అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.కనుక పాలను పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
Share your comments