ప్రస్తుత కాలంలో మన ఆహార విషయంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ క్రమంలోనే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము. మనం క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుని తక్కువగా నీరు తీసుకున్నప్పుడు ఆ క్యాల్షియం మూత్రపిండాలలో పేరుకుపోయి రాళ్లుగా మారుతుంది. ఈ క్రమంలోనే మనకు కిడ్నీలలో రాళ్ళు ఏర్పడుతున్నాయని చెప్తాము. అయితే మన కిడ్నీలలో రాళ్లు ఏర్పడినప్పుడు ముందుగా కొన్ని లక్షణాలు మనలో కనపడతాయి. ఈ లక్షణాలు కనుక మనలో కనబడుతూ ఉంటే తప్పకుండా మన కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అర్థం.
కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు మూత్రాశయానికి వెళ్ళినప్పుడు మూత్రం దుర్వాసన వస్తుంది. అదేవిధంగా మూత్రం రంగు కూడా మారుతుంది. కొన్నిసార్లు మూత్రాశయం ద్వారా మూత్రంతో పాటు కొన్నిసార్లు రక్తం కూడా వస్తుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు మీలో కనబడితే మీరు తప్పకుండా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా మరికొందరిలో తీవ్రమైన నొప్పి సమస్య వెంటాడుతుంది.
గుడ్ న్యూస్.. ఈరోజు నుంచి రైతు బందు డబ్బుల పంపిణి ..!
చాలా రోజుల నుంచి మీరు వెన్ను నొప్పి సమస్యతో బాధ పడుతున్నారు అంటే అందుకు కారణం మీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని అర్థం. ఈవిధంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వారికి తరచూ జ్వరం రావడంతోపాటు కొన్నిసార్లు కడుపు ఉబ్బరం అనిపించి వాంతి రావడం వంటి లక్షణాలు కూడా తలెత్తుతుంటాయి.ఈ విధమైనటువంటి లక్షణాలు తరచూ మీలో కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ద్వారా కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు.ముఖ్యంగా ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు అధిక మొత్తంలో నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments