Health & Lifestyle

ఎండాకాలం లో పుచ్చకాయతో డీహైడ్రేషన్​కు చెక్ పెట్టండి !

Srikanth B
Srikanth B
watermelon
watermelon

ఎండాకాలం లో శరీరానికి అధిక శక్తి అవసరం ఎండలు ముదిరే కొద్దీ చెమటల రూపంలో శరిరం అధిక శక్తిని కోల్పోతుంది కాబ్బటి శరీరానికి ఎప్పటికప్పుడు పోషకాలు అందేలాగా చూసుకోవాలి లేదంటే శరీరం డీహైడ్రేషన్​కు గురి అయ్యే అవకాశం వుంది . ఎండాకాలంలో శరీరం శక్తిని కోల్పోకుండా ఉండేందుకు పుచ్చకాయను తీసుకోవడం ఉత్తమం .

 

పుచ్చకాయను తినడం వల్ల త్వరగా కడుపు నిండడం సహా జీర్ణశక్తి పెరుగుతుంది. ఎలక్ట్రోలైట్లు, ఖనిజ లవణాలు, పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనిని అన్ని వయసుల వారు తినవచ్చు. తక్కువ స్థాయిలో షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ రోగులు కాడా తినవచ్చు అని నిపుణలు చెబుతున్నారు.

పుచ్చకాయతో తినడం ద్వారా కలిగే లాభాలు
పుచ్చకాయను తినడం/జ్యూస్ తాగడం వల్ల శరీరానికి బీటా కెరాటిన్, విటమిన్ ఎ, బి1, బి6, మెగ్నీషియం, సి, పొటాషియం లభిస్తాయి. అలాగే పుచ్చకాయ గుజ్జులో, తొక్కలో సిట్రోలిన్ అనే అమైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తనాళాలు బాగా పనిచేస్తాయి. అలాగే పుచ్చకాయలో ఎక్కువగా పొటాషియం ఉండటం వల్ల రక్తపోటు తగ్గుతుంది. పుచ్చకాయ వల్ల లభించే లైకోపెన్.. గుండెజబ్బు ముప్పును తగ్గిస్తుంది. చర్మ సంరక్షణలో కూడా పుచ్చకాయ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా! ఐతే ఇది తినండి..

 

సీజన్ ను బట్టి లభించే పండ్లను తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఆయా వాతావరణానికి తట్టుకునే విధంగా తయారు చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయం పడుతున్నారు . కాబ్బటి మీరుకూడా ఈ ఎండాకాలం లో అవసరమైన మేర పుచ్చకాయను తినడం ద్వారా డిహైడ్రాషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు కాబ్బటి ఎండాకాలం లో దొరికే ఈ పండును విస్మరించకండి .

బరువు తగ్గాలనుకుంటున్నారా! ఐతే ఇది తినండి..

Share your comments

Subscribe Magazine