రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్లర్ల అసవరమే ఉండదంటారు. ఎందుకంటే యాపిల్‌లో శరీరానికి ఆరోగ్యానిచ్చే అనేక పదార్థాలు ఉంటాయి. అందుకే యాపిల్ని అందరూ ఇష్టపడతారు. యాపిల్‌లో ప్రొటీన్స్, విటమిన్స్‌తో పాటు శరీరానికి శక్తిని అందించేవి అనేకం ఉంటాయి. యాపిల్ ఒక్కటే కాదు.. పండ్లన్నీ ఆరోగ్యానికి మంచివే. రోజూ పండ్లు తీసుకోవడం వల్ల మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి పండులోనూ ఆరోగ్యానికి మంచి చేసే పదార్థాలు చాలా ఉంటాయి.
ఇక కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పండ్లు చాలా ఉపయోగపడతాయి. అందులో భాగంగా ఇప్పుడు బొప్పాయితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, ప్లేవనాయిడ్స్, పొటాషియం, మినరల్స్, కాపర్, మెగ్నిషియం, ఫైబర్ వంటివి ఉంటాయి. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచడంలో బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఇక భోజనం తర్వాత బొప్పాయి తింటే పొట్ట, పేగుల్లో పేరుకుపోయే విష పదార్థాలను తొలగిస్తుంది. అలాగే ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇక శరీరంలోని ప్లేట్ లెట్స్ తగ్గిపోయినప్పుడు.. బొప్పాయి తింటే ప్లేట్ లెట్స్ పెరుగుతాయి.
డెంగీ ఫీవర్ వచ్చినప్పుడు కొంతమంది ప్లేట్ లెట్స్ పడిపోతాయి. అలాంటి సమయంలో బొప్పాయి తింటే ప్లేట్ లెట్స్ మళ్లీ పెరుగుతాయి. అలాగే బొప్పాయి ఆకుల రసం తాగినా ఫలితం ఉంటుంది. ఇక గుండెకు రక్తం చక్కగా సరఫరా చేయడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది. అలాగే చెడు కొవ్వును తగ్గిస్తుంది.
అలాగే బొప్పాయి తీసుకోవడం వల్ల కిడ్నీలలో ఉండే రాళ్లు కరిగిపోతాయి. కిడ్నీలలో రాళ్లు ఏర్పడి ఇబ్బంది పడేవారు బొప్పాయి తింటే ప్రయోజనం ఉంటుందది. ఇక అలసట, నీరసంను బొప్పాయి తరిమికొడుతుంది. ఇక కొలవ్, గర్భాశయ క్యాన్సర్లను తగ్గిస్తుంది. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు బొప్పాయి తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
గర్భిణీ మహిళలు బొప్పాయి తినకూడదు. ఎందకంటే విపరీతంగా వేడి వస్తుంది. ఇక వారానికి రెండు, మూడుసార్లు కంటే మంచి బొప్పాయి తినకూడదు. రోజూ తింటే కామెర్లు వచ్చే అవకాశముంది.
Share your comments