భారతీయ వంటకాల్లో ప్రతిరోజు ఉపయోగించే కాయగూరల్లో టమాటోకు చాలా ప్రాముఖ్యత ఉంది.చూడముచ్చటగా ఉండే టమాటో ఆహారంలో అద్భుతమైన రుచిని ఇవ్వడంతోపాటు, మన నిత్య జీవితానికి అవసరమైన అనేక పోషక విలువలు సమృద్ధిగా కలిగి ఉంది. కావున టమాటోను ప్రతి రోజు ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవడం వల్ల మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి.
తాజా అధ్యయనం ప్రకారం టమోటో ఉదర క్యాన్సర్ కణాలపై సమర్థవంతంగా పోరాడి గ్యాస్ట్రిక్ కాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మంచి ఔషధంలా పని చేస్తోందని వెల్లడించారు.కావున టమాటోని సహజ కాన్సర్ ఫైటర్ అని చెప్పవచ్చు. టమాటోలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడి ప్రోస్ట్రేట్, సర్వికల్, నోరు, గొంతు వంటి అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాలు నివారించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
టమోటాలలో సహజంగా సోడియం,కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. కావున వీటిని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గి ప్రమాదకర గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. టమోటోలో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. టమోటోలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది కావున కంటి సమస్యలు తొలగి కంటి చూపు మెరుగుపడుతుంది. కాబట్టి టమోటోను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటే సహజ పద్ధతిలో మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
Share your comments